నూతన అప్ డెట్ కి వాట్స్ యాప్ శ్రీకారం. వీడియో కాల్ ఉండగా మేసేజ్ లు పంపోచ్చు. కేవలం బీటా వర్షన్ ఉన్న యూజర్లకు మాత్రమే.
వాట్సాప్ మెసెంజర్ మరో నూతన ఫీచర్ ను తీసుకురానుంది. కేవలం మేసెజ్‌ల కోసం ప్రారంభం అయినా ఈ మెసేజింగ్ అప్లిషన్ సంస్థ తరువాతి కాలంలో అడియో, వీడియో కాలింగ్ సదుపాయాలను తీసుకొచ్చింది. ఇప్పుడు నూతనంగా మరో ఫీచర్‌ను కోట్లాది ప్రజలకు అందించడానికి సిద్దమయింది. అదే పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్ సౌకర్యం.
పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్ అంటే వాట్సాప్ వీడియో కాల్ లో మనం మాట్లాడుతుంటే ఎవరికైనా టెక్ట్స్ పెట్టాలనుకుంటే పెట్టడమే. దీని గురించి వాట్సాప్ మెసేంజర్ సంస్థ నుండి అధికారిక సమాచారం లేదు. కానీ ఈ పిక్చర్-ఇన్-పిక్చర్ ని పరీక్షీస్తునట్లు వివరాలు లీక్ అయ్యాయి. ఇది కేవలం బీటా వర్షన్ ఉన్న వారికి మాత్రమే పని చేస్తుందని లీక్ అయిన వివరాల ద్వారా తెలుస్తుంది.
