ఆడపిల్లను కన్నందుకు భార్యను కొట్టి వివాదంలో చిక్కుకున్న టీఆర్ఎస్ యూత్ లీడర్ పులకండ్ల శ్రీనివాస్ రెడ్డి మరో బాగోతం బయటపడింది. ఇప్పటివరకు అతడికి ఇద్దరు భార్యలే అనుకుంటుంటే తాజాగా నేను అతడి మూడో భార్యను అంటూ మరో మహిళ ముందుకు వచ్చింది. ఈమె రాకతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది.
ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో మొదటి భార్యను కాదని మరో మహిళను ఇంటికి తెచ్చుకున్నాడు శ్రీనివాస్ రెడ్డి. ఈ  వ్యవహారంపై మొదటిభార్య అతడిని నిలదీయడం, అతడు అతడి కుటుంబసభ్యులు ఆమెను చితకబాదడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో అతడు, అతడి కుటుంబం ఇంటికి తాళం వేసి పరారయ్యారు.
అయితే ఇవాళ అతడి మూడో భార్యనంటూ మరో మహిళ మేడిపల్లి  పోలీసుల వద్దకు చేరడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. తనను శ్రీనివాసరెడ్డి మూడో పెండ్లి చేసుకున్నట్లు దేవి జగదీశ్వరి అనే మహిళ పోలీసులకు తెలిపింది.తమ పెళ్లి శ్రీశైలంలో జరిగినట్లు.ఆ సమయానికి తాను మేజర్ నే అని, ఇష్టపూర్వకంగానే అతడ్ని పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. తమ పెళ్లి శ్రీశైలంలో జరిగినట్లు తెలిపింది. తనకు తర భర్తతో(శ్రీనివాస్ రెడ్డి) తో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది.
ఇలా మూడు పెళ్లిలతో రోజుకో వివాదంతో  వార్తల్లో నిలుస్తున్న ఈ టీఆర్ఎస్ యూత్ లీడర్ పై చర్యలు తీసుకోడానికి పోలీసులు చర్యలు చేపడుతున్న వేళ ఈ వివాదం బయటపడింది. 

 

శ్రీనివాస్ రెడ్డికి సంభందించిన మరిన్ని వీడియోలకోసం క్రింది లింక్ ను క్లిక్ చేయండి

https://goo.gl/utykNi

https://goo.gl/d8unH1