Asianet News TeluguAsianet News Telugu

రేవంత్, లక్ష్మారెడ్డి వివాదంలో కొత్త ట్విస్ట్ (వీడియో)

  • ముదిరిన రేవంత్ లక్ష్మారెడ్డిల గొడవ
  • జడ్చర్ల లో ఉద్రిక్త పరిస్థితులు
  • వ్యక్తుల గొడవ కాస్త పార్టీలకు పాకిన వైనం
new twist on revanth reddy and minister laxma reddy fight

రేవంత్, లక్ష్మారెడ్డి ల మధ్య మాటల యుద్ధం మరో మలుపు తిరిగిగింది. వ్యక్తుల మధ్య వివాదం పార్టీ లకు పాకింది. దీంతో జడ్చర్ల లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జడ్చర్ల జనగర్జన సభ తో ఒక్కసారిగా జడ్చర్ల వాతావరణం వేడెక్కిన విషయం తెలిసిందే. ఈ సభలో ప్రసంగిస్తూ రేవంత్ రెడ్డి  టీఆర్ఎస్ సర్కార్ పై, ముఖ్యంగా మంత్రి, స్థానిక శాసనసభ్యుడు లక్ష్మారెడ్డి పై మండిపడ్డాడు. దీనికి మంత్రి అదే  రీతిలో కౌంటరివ్వడం జరిగాయి.  దానిపై మళ్లీ రేవంత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తిట్ల డోస్ కూడా పెంచారు.

ఇలా ఇప్పటికే వేడిమీదున్న జడ్చర్లలో ఇవాళ మరో వివాదం చెలరేగింది. స్థానిక టీఆర్ఎస్ నాయకులు మంత్రిపై రేవంత్ చేసిన పరుష తిట్లకు వ్యతిరేకంగా ఇవాళ జడ్చర్లలో ర్యాలీ నిర్వహించడానికి పూనుకున్నారు. ఇదే సమయంలో మంత్రి రేవంత్ పై చేసిన  వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా భారీ ర్యాలీకి ప్లాన్ చేశారు. ఇలా ఇరు వర్గాలు పోటాపోటీగా ర్యాలీలు చేపడితే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తి శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని గ్రహించిన పోలీసులు ఇరు వర్గాలను నచ్చజెప్పి ర్యాలీలను విరమింప జేశారు. ఈ ర్యాలీల కథ ముగిసిందని పోలీసులు ఊపిరి పీల్చుకుంటుండగా మరో వివాదం మొదలైంది.  రేవంత్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు, మంత్రిపై కాంగ్రెస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేశారు. ఇలా నాయకుల మధ్య వివాదం కాస్తా కార్యకర్తలకు పాకడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని అటు పోలీసులు, ఇటు ప్రజలు భావిస్తున్నారు.    
 
మొదటి నుండి ఈ వివాదాన్ని పరిశీలిస్తే... జడ్చర్ల జనగర్జన సభలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ రేవంత్, స్థానిక శాసనసభ్యుడు లక్ష్మారెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.  తాను పెద్ద డాక్టర్ అని చెప్పుకునే మంత్రి లక్ష్మారెడ్డి అసలు డాక్టరే కాదని, అతడో మున్నాభాయ్ అని రేవంత్ విమర్శించాడు. మంత్రిగా తానేదో పొడిచేశానని చెప్పే ఆయన తన హయాంలో ఓ వంద పడకల ఆస్పత్రిని నియోజకవర్గానికి తేవడానికి చేతకావడం లేదని విమర్శించారు. ఈ విమర్శలను తిప్పికొట్టే క్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డిని అరె, ఒరే అంటూ తిట్టాడు. దీంతో చిర్రెత్తిపోయిన రేవంత్ ఇక రాయడానికి వీలులేని తిట్లతో రెచ్చిపోయాడు. మంత్రి జాతకమేమిటో తనకు తెలుసని, అతడో బ్రోకర్ అంటూ, కేసీఆర్ బూట్లు నాకి అధికారంలోకి వచ్చి తనను తిడతావా అంటూ రేవంత్ ఘాటుగా స్పందించాడు.  ఇలా ఇరువురు వ్యక్తిగత దూషనలకు దిగడంతో జడ్చర్లలో రాజకీయ వేడి రాజుకుంది.

లక్ష్మారెడ్డిపై రేవంత్ ఎలా విరుచుకుపడ్డాడో చూడండి

  

ఇలా ఇరువురి మధ్య మాటల యుద్దం పెరిగి అది కార్యకర్తల స్థాయికి చేరింది. ఈ గొడవ ప్రస్తుతం వ్యక్తుల నుంచి పార్టీల మధ్యకు పాకింది.
  

Follow Us:
Download App:
  • android
  • ios