గజల్ శ్రీనివాస్ కేసులో కొత్త ట్విస్ట్

First Published 3, Jan 2018, 4:40 PM IST
new twist on gajal srinivas case
Highlights
  • సేవ్ టెంపుల్ సంస్థ నుండి గజల్ శ్రీనివాస్ బహిష్కరణ
  • ప్రకటించిన సంస్థ అద్యక్షుడు ప్రకాష్ రావు వెలగపూడి

లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు పాలైన గజల్ శ్రీనివాస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది.  ఆయన "సేవ్ టెంపుల్" అనే  దార్మిక సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో అతడ్ని తమ ఆర్గనైజేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా తొలగిస్తున్నట్లు ఆ సంస్థ అద్యక్షుడు ప్రకాష్ రావు వెలగపూడి తెలిపాడు. తమ సంస్థలో స్త్రీ లను దేవతలుగా భావిస్తామని, అలాంటి మహిళని లైంగికంగా వేధించిన గజల్ శ్రీనివాస్ తమ సంస్థకు మచ్చ తెచ్చాడని ఆరోపించాడు. దేవాలయాలనే కార్యాలయాలుగా బావిస్తూ, దార్మిక కార్యక్రమాలతో ముందుకు పోతున్న సంస్థ ను  వివాదాల్లోకి లాగిన శ్రీనివాస్ ను వెంటనే తమ సంస్థ నుండి తొలగిస్తున్నట్లు ప్రకాష్ రావు తెలిపారు.  

గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు సంభందించిన వివరాలిలా ఉన్నాయి. ఖైరతాబాద్ లో సేవ్ టెంపుల్ సంస్థ ఆద్వర్యంలో ఆలయవాణి అనే రేడియో సంస్థ నడుస్తోంది. ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వున్న శ్రీనివాస్ ఈ రేడియో వ్యవహారాలు కూడా చూసుకుంటున్నాడు. సంస్థ యజమానులు ఆమెరికాలో ఉంటారు కాబట్టి ఈ రేడియో సంస్థలో జరిగే వ్యవహారాలేవి వారికి తెలీవు. కాబట్టి ఇందులో  శ్రీనివాస్ ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది.ఇందులో కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ యువతి  రేడియో జాకీగా పనిచేస్తోంది. ఆమెపై కన్నేసిన శ్రీనివాస్ కార్యాలయంలోనే  లైంగికంగా వేధించేవాడు. మసాజ్ పేరుతో వెకిలిగా ప్రవర్తించి, ఆమె ముందు బట్టలు విప్పి వికృతంగా ప్రవర్తించేవాడు. బాధితురాలి పేదరికాన్ని అడ్డం పెట్టుకుని వశపర్చుకోవాలని ఈ మద్య తీవ్రంగా వేధించడం ప్రారంభించాడు. దీంతో అతడి వికృత చేష్టలను వీడియోలో రికార్డు చేసిన మహిళ, పోలీసులకు వీడియో సాక్ష్యాలను అందించి ఫిర్యాదు చేసింది. దీంతో  పంజాగుట్ట పోలీసులు అతడ్ని నిన్న అరెస్ట్ చేసిన విశయం తెలిసిందే.
 
 గజల్ శ్రీనివాస్ పై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. నాంపల్లి కోర్టు అతడికి 12 వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించి, చంచల్‌గూడ జైలుకు తరలించాల్సిందిగా ఆదేశించింది.  అయితే ఆయన బెయిల్ పిటిషన్ పై ఇవాళ కోర్టులో వాదనలు జరిగాయి. శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని పోలీసులు కోర్టుకు వివరించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును మాత్రం రేపటికి వాయిదా వేసింది. 

ఇలా ఇప్పటికే లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన గజల్ కు సేవ్ టెంపుల్ సంస్థ మరో షాక్ ఇచ్చింది.
 

loader