ఇటీవల కాలంలో అక్రమ సంబందాల కారణంగా అనేక హత్యలు  తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఈ తరహా హత్యల్లో ఎక్కువగా మగ వాళ్లే బలయ్యారు. భార్యలు అక్రమ సంబంధం పెట్టుకుని భర్తలను మట్టుబెట్టిన ఘటనలు కోకొల్లలుగా జరిగాయి. నాగర్ కర్నూల్ స్వాతి, మహబూబ్ నగర్ లక్ష్మి వరకు అక్ర సంబంద హత్యలు కొనసాగాయి. కానీ వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఈ హత్యలకు బిన్నంగా మరో అక్రమ సంబంద హత్య జరిగింది. ఇక్కడ ఒక మహిళా టీడిపి నేత తన భర్తతో అక్రమ సంబందం పెట్టుకుందని ఆ మహిళా టిడిపి నేతను ఆమె హత్య చేయించింది. ఈ హత్య మిస్టరీని పోలీసులు చేదించారు. తెలంగాణ లో సంచలనం సృష్టించిన మహిళా టిడిపి నాయకురాలి దారుణ హత్యకు సంబందించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.  

 కాటారం మండల టిడిపి అద్యక్షురాలిగా వున్న రామిల్ల కవిత  కొత్తపల్లి గ్రామంలో నివాసముంటోంది. కుటుంబ కలహాల కారణంగా భర్తతో విడిపోయిన ఈమె తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని వేరుగా కాపురం ఉంటోంది. ఈ క్రమంలో ఈమెకు ములుగు సర్పంచి గుగ్గిళ్ల సాగర్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి అక్రమ సంబంద విషయం తెలిసిన సాగర్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కవిత, సాగర్మ లకు కౌన్సెలింగ్ నిర్వహించి వదిలిపెట్టారు. అయినా వీరిలో ఎలాంటి మార్పు రాలేదు. యదావిదిగా తమ సంబందాన్ని కొనసాగించారు.

దీంతో ఎలాగైనా తన భర్తను కవిత నుండి వేరు చేయాలని కవిత భావించింది. ఇందుకోసం కవిత అడ్డు తొలగించుకోడమే ఏకైక మార్గంగా భావించి హత్యకు ప్లాన్ చేసింది. కవితను హత్య చేసేందుకు పెద్దాపురానికి చెందిన కన్నూరి కుమారస్వామికి రూ.5 లక్షల సుపారీ ఇచ్చింది. దీంతో కుమారస్వామి మరికొందరితో కలిసి కవితను హతమార్చేందుకు ఈనెల 11న కొత్తపల్లికి వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో వెనక కిటికీలోంచి అశోక్‌, చిరంజీవిలు ఇంట్లోకి ప్రవేశించి, కవితను హత్య చేసి పారిపోయినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో గుగ్గిళ్ల సుజాత, రజినీకాంత్‌, అశోక్‌, కుమారస్వామి, జగదీశ్‌, మోహన్‌, చంద్రయ్యలను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న చిరంజీవి, రాజులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.