ఆగస్టు 1 నుంచి కొత్త ట్రాఫిక్   రూల్స్ విజయవాడ లో ఇప్పటికే అమలు  బందరు రోడ్ లో 40 కి.మీ  దాటితే జరిమానా   వాహనదారులు తస్మాత్   జాగ్రత్త 

ఆగస్టు 1వ తేదీ నుంచి ఏపీలో కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇకమీదట ట్రాఫిక్‌ పోలీసులు జరిమానాలతో పాటు నిబంధనలు ఉల్లంఘించే వారికి ప్రతి తప్పుకు కొన్ని పాయింట్లను వారి ఖాతాల్లోకి చేర్చనున్నారు. రెండు సంవత్సరాల్లో 12 పాయింట్లు దాటితే సంవత్సరం పాటు లైసెన్సును రద్దు చేయనున్నారు. అనంతరం తిరిగి రెండు సంవత్సరాల్లో మరో 12 పాయింట్లు తెచ్చుకుంటే మూడు సంవత్సరాల వరకు డ్రైవింగ్‌ లైసెన్సును సస్పెండ్‌ చేస్తారు. అయినప్పటికీ నిబంధనలు పాటించకపోతే శాశ్వతంగా లైసెన్స్‌ రద్దుతో పాటు భారీ జరిమానా, జైలు శిక్ష అమలయ్యేలా నూతన చట్టాలు అమలు చేయనున్నారు. ఇప్పటికే  విజయవాడ బందరు రోడ్ లో  40 కి.మీ వేగం దాటితే  జరిమానా  విధిస్తున్నారు. ఇక  వాహన దారులు  జాగ్రత్త గా  లేకుంటే  జరిమానా చెల్లించాల్సి రావడం ఖాయం.

 

ఏ రూల్స్ అతిక్రమణకు ఎన్ని పాయింట్ లో  తెలుసుకోండి......

 

*ఆటోలలో డ్రైవర్‌ పక్కసీట్‌లో ప్రయాణికులను తీసుకెళుతూ పట్టుబడితే : 1 పాయింటు

*గూడ్స్‌ వాహనాల్లో (వస్తువులను) ప్రయాణికులను తీసుకెళ్తే : 2 పాయింట్లు

* సీట్‌ బెల్టు లేదా హెల్మెట్‌ లేకుండా వాహనాలను నడిపితే : 1 పాయింటు

* రాంగ్‌ సైడ్‌లో వాహనం నడుపుతూ పట్టుబడితే : 2 పాయింట్లు

* గంటకు 40 కిలోమీటర్లకు మించిన వేగంతో నడిపితే: 2 పాయింట్లు

* అనుమతి ఉన్న వేగాన్ని అధిగమించి గంటకు 40 కిలోమీటర్ల పైబడి నడిపితే : 2 పాయింట్లు

*సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం, వాహనానికి ఇరుపక్కల అధికంగా వస్తువులను తీసుకెళ్లడం, ట్రాఫిక్‌ సిగ్నళ్లను అతిక్రమించడం, జీబ్రా లైన్లను దాటడం, జిగ్‌జాగ్‌ డ్రైవింగ్‌కు : 2 పాయింట్లు

* మద్యం తాగి ద్విచక్ర వాహనం నడిపితే : 3 పాయింట్లు

*మద్యం తాగి నాలుగు చక్రలా వాహనాలు, లారీ, రవాణా వాహనాలు నడిపితే : 4 పాయింట్లు

* మద్యం తాగి ప్రజా రవాణా వాహనాలు, బస్సులు, క్యాబ్ లు నడిపితే: 5 పాయింట్లు

*వాహనాలు నడుపుతూ రేసింగ్‌, వేగ పరీక్షల్లో పట్టుబడితే : 3 పాయింట్లు

* ప్రమాదకరస్థితిలో ఉన్న వాహనాన్ని వినియోగించడం, రోడ్లపై అభ్యంతరకరంగా ఉన్న హారన్‌ను వినియోగించడం, హైవేపై ప్రమాదకరంగా వాహనాన్ని నడిపితే : 2 పాయింట్లు

* ఇన్సూరెన్స్‌ లేకుండా వాహనాన్ని నడిపితే : 2 పాయింట్లు

* అపాయకరమైన వస్తువులను తీసుకెళ్లే వాహనాలకు పబ్లిక్‌ లయబులిటీ సర్టిఫికెట్‌ లేకుండా నడిపితే : 2 పాయింట్లు

* గుర్తించదగిన నేరాలు ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ సెక్షన్‌ 279, 336, 237, 338 కేసుల్లో నేరం రుజువైతే : 2 పాయింట్లు

* నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ఎదుటివారి మృతికి కారకులైతే.. (కోర్టులో నేరం రుజువైతే) 304ఎ ఐపీసీ లేదా 304 ఐపీసీ కింద : 5 పాయింట్లు

*చైన్‌స్నాచింగ్‌, దోపిడీ తదితర నేరాల్లో వినియోగించిన వాహనాలతో పట్టుబడితే (కోర్టులో నేరం రుజువైతే) : 5 పాయింట్లు