ఇక‌ రింగ్ తో మీరు ఫోన్ మాట్లాడవచ్చు

new technology for calling system
Highlights

 •  ప్ర‌తి సారీ ఫోన్ తీయాల్సిన అవ‌స‌రం లేదు.
 • ఎస్ఎమ్ఎస్ వ‌చ్చినా అదే వినిసిస్తుది.
 • మ‌నం మాట్లాడుతుంటే మ‌న శ‌బ్దం త‌ప్పా ఇత‌రుల శ‌బ్దం ఎదుటి వారికి చేర‌దు.
 • ఇందులో గూగుల్ లో ఏ స‌మాచారాన్ని అయినా స‌ర్ఫ్ చెయ్య‌వ‌చ్చు.

ఇక‌ రింగ్ తో మీరు ఫోన్ మాట్లాడొచ్చు.

ఫోన్ మాట్లాడ‌టం అంటే త‌ప్ప‌కుండా ఫోన్ లిప్ట్ చేచసి చెవి దగ్గ‌ర పెట్టుకొని మాట్లాడాలి. లేదంటే బ్లూటుత్ ని వాడాలి. అది కాదంటే హెడ్‌సెట్ ని వాడాలి. ఇందులో ప్ర‌తి దాని నుండి ఒక స‌మ‌స్య ఉంది. ఫోన్ ప్ర‌తి సారి లిప్ట్ చేసి మాట్లాడం  కుద‌ర‌దు, కొన్ని సార్లు క‌ష్టమ‌వుతుంది. ఇక బ్లూటుత్ అయితే రెడియోష‌న్ స‌మ‌స్య‌. ఇయ‌ర్ ఫోన్స్ అయితే ఎప్పుడు చెవుల‌కు పెట్టి ఉండాలి. కానీ ఇక ఈ అవ‌స‌రం ఉండ‌దు.  ఎందుకంటే ఫోన్ చెవి ద‌గ్గ‌ర పెట్టుకొని మాట్లాడే కాలం పోయింది. ఇక అంతా స్మార్ట్ కాలింగ్ అంటే బ్లూటుత్ క‌న్న చిన్న‌గా ఉండే స్మార్ట్ రింగ్.  

హాంకాంగ్ చెందిన ఓరిగామీ ల్యాబ్స్ అనే స్టార్ట‌ప్ కంపేనీ ఓరీ అనే రింగ్ ను త‌యారు చేసింది. ఈ ఓరీ ప్ర‌త్కేక‌త ఫోన్ మాట్లాడ‌టం. సాధార‌ణంగా మీ ఫోన్ నుండి ఈ ఓరీ కి క‌నేక్ట్ చేసుకొవాలి. త‌రువాత ఈ రింగ్ ను మీ చూపుడు వ్రేలుకు పెట్టుకోవాలి. మీకు ఫోన్ వ‌చ్చిన‌ప్పుడు మీకు స‌మాచారం అందిస్తుంది. వ‌చ్చే ఫోన్ ను లిప్ట్ చేయ్యాలంటే త‌ప్ప‌కుండా మీరు చూపుడు వ్రేలుతో చేవి ద‌గ్గ‌ర ఉండే ప‌లుచ‌ని ఎముక‌ని తాకితేనే ప‌ని చేస్తుంది. అదేలా అనే అనుమానం క‌ల్గుతుంది క‌దా...ఈ రింగ్ బోన్ కండెక్ష‌న్ టెక్నాల‌జీతో ప‌నిచేస్తుంది. అంటే చెవి ద‌గ్గ‌ర ఉండె బోన్ కి రింగ్ కి మ‌ధ్య అనుసంధాన క‌ర్త‌గా ప‌ని చేస్తుంది. మ‌న చూపుడు వ్రేలు చెవి దగ్గ‌ర తాక‌గానే సిగ్న‌ల్స్ ట్రాన్స్‌ఫ‌ర్ అవుతాయి. అక్క‌డి నుండి వ‌చ్చే త‌రంగాలు మ‌న చెవిలోకి చేరుతాయి. అప్పుడు మ‌న‌కు కాల్ చేసిన వారి వాయిస్ మ‌న చెవిని చేరుతుంది. 

 

ఓరీ ఉప‌యోగాలు

 

 •  ప్ర‌తి సారీ ఫోన్ తీయాల్సిన అవ‌స‌రం లేదు.
 • ఎస్ఎమ్ఎస్ వ‌చ్చినా అదే వినిసిస్తుది.
 • మ‌నం మాట్లాడుతుంటే మ‌న శ‌బ్దం త‌ప్పా ఇత‌రుల శ‌బ్దం ఎదుటి వారికి చేర‌దు.
 • ఇందులో గూగుల్ లో ఏ స‌మాచారాన్ని అయినా స‌ర్ఫ్ చెయ్య‌వ‌చ్చు.
 • గూగుల్, యాఫిల్ సిరి ల‌ను ఓరీ సింగిల్ వాయిస్ అందిస్తుంది.
 •  ఒక్క సారీ చార్జ్ పెడితే 45 గంట‌లు మాట్లాడ‌వ‌చ్చు.
 • ఏ స‌మాచారం అయిన అందిస్తుంది.
 • ఎవ‌రి నుండి స‌మాచారం అయినా ఎల్ ఈడీ లైట్ పై క‌నిసిస్తుంది.


ఓరీ కొనాల‌ని అనుకుంటున్నారా..! అయితే ఈ సంవ‌త్స‌రం చివ‌రి మాసం లో మార్కెట్ లోకి తీసుకురానున్నారు. దీని ధ‌ర రూ 10,000 ఉండ‌వ‌చ్చ‌ని అంచ‌నా.
    

loader