జియో ఫోన్ ఎఫేక్ట్ తో నష్టాలతో ఐడియా, ఎయిర్ టెల్. నూతన ఫోన్ కోసం ఐడియా ప్రయత్నాలు. జియో ఫోన్ కు పోటీగా ఐడియా ఫోన్.
జియో సిమ్ తో కోట్లాది మంది టెలికాం యూజర్లను తన వైపుకి ఆకట్టుకున్న రిలయన్స్ సంస్థ. మరో బంఫర్ ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే, దేశంలో ఉన్న ప్రజలందరికి ఉచిత 4జీ ఫోన్ ను తీసుకొస్తుంది. కేవలం రూ.1,500 డిపాజిట్ చేస్తే చాలు అంటూ ఇటీవలే రిలయన్స్ జియో ప్రకటించింది. జియో 4జీ ఫోన్ లో 4జీ బ్రాడ్ బ్యాండ్, చాలా తక్కువ ధరకు విక్రయిచడంతో నెలంతా ఉచితంగా మాట్లాడుకునే అవకాశాన్ని కేవలం రూ.149కే పొందొచ్చని ప్రకటించింది.
ఇప్పుడు జియో ప్రకటించిన ఆఫర్ మిగతా టెలికాం కంపేనీలకు కష్టాలను తెచ్చిపెట్టింది. ఇప్పటికే జియో ఉచిత డేటా ఆఫర్ పథకాలతో భారీ నష్టాల్లో కూరుకుపోయిన, ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులర్ త్వరలో రానున్న జియో చౌక ఫోన్ దెబ్బకు మరిన్ని నష్టాలను కల్గించనుందని భావిస్తున్నాయి. ఇప్పటికే ఐడియా గత మూడు నెలల్లో 1000 కోట్ల నష్టాలను చవిచూసింది. దేశంలో ఉన్న అన్ని టెలికాం యూజర్లు జియో కొట్టిన దెబ్బను నుండి ఎలా బయటపడాలని ఆలోచిస్తున్నారు.
అందులో మొట్ట మొదటగా ఐడియా తన ప్రయత్నాలను ప్రారంభించింది.
జిమో చౌకైన ఫోన్లను అందిస్తు, అందులో తక్కువ టారీఫ్ కే డెటాను, కాల్స్ ను అందిస్తుంది. ఇక మీదట యూజర్లు తమ నుండి బయటికి పోతారని ఐడియా భావిస్తుంది. అలా పోకుండా జియో తో పోటీకి తాము సై అంటుంది. ఐడియా కొత్తగా ఫోన్ తయారీదారులతో ఒప్పందాలు చేసుకుని, బండిల్డ్ ఆఫర్లను ప్రకటించే ఆలోచన చేస్తున్నట్టు ఐడియా ఎండీ హిమాన్షు కపానియా తెలిపారు. త్వరలోనే ఐడియా నుండి కూడా తక్కువ ధరకే ఫోన్లను తీసుకురావడానికి ప్రయత్నిస్తుందని ఆ కంపెనీ ఎండీ తెలిపారు.
