నెల్లూరు వైసిసి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఏమి చేసినా కొత్తదనం ఉంటుంది అది నిరసన కావచ్చు, నియోజకవర్గం చూసేందుకు చేసే పాదయాత్ర కావచ్చు,
శ్రీధరన్న వస్తున్నాడు... (వీడియో)

నెల్లూరు వైసిసి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఏమి చేసినా కొత్తదనం ఉంటుంది. అది నిరసన కావచ్చు, నియోజకవర్గం చూసేందుకు చేసే పాదయాత్ర కావచ్చు, లేదా ప్రజలను స్నేహపూర్వకంగా పల్కరిచేందుకు జరిపే ఆత్మీయ యాత్ర కావచ్చు. అందులో శ్రీధర్ ముద్ర ఉంటుంది. ఇపుడాయన 105 రోజుల ‘మన ఎమ్మ్యల్యే- మన ఇంటికి’ కార్యక్రమం చేపడుతున్నాడు. ఆ పేరులోనే ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధం అర్థమవుతుంది. తాను విఐపి గా రావడం లేదు. ‘మీ మనిషిగా, మీ ఇంటిమనిషిగా, ఒక ఆత్మీయుడిగా’ వస్తున్నానంటున్నాడు. కాబట్టి హంగు ఆర్భాటాలొద్దని ముందే చెబుతున్నాడు. సాదాసీదాగా మనం కలుసుకుందాం, పల్కరించుకుందాం, మాట్లాడుకుందాం అనే సాన్నిహిత్యం ఇందులో ఉంది. మీ మర్యాదల కోసం రాలేదు. మీ దీవెనల కోసం వస్తున్నానని వినయంగా చెబుతున్నాడు. దసరా రోజు ఉదయం 8గంటలకు ఆయన అందరి ఇళ్లకు బయలుదేరుతున్నాడు. 105 రోజులు ఇల్లిళ్లూ తిరుగుతాడు. 106 రోజున మాత్రమే తన ఇంటికి వెళతాడు. ఇలాంటి కార్యక్రమం ఒక ఎమ్మెల్యే చేపట్టడం, రాష్ట్రంలో ఇదే మొదలుకావచ్చు. ఈ కార్యక్రమం గురించి ఆయన మాటల్లోనే విందాం.
