కడప జిల్లాలో దారుణం నారాయణ జూనియర్ కాలేజి విద్యార్థిని  ఆత్యహత్య  విద్యార్థి సంఘాల ఆందోళన

కార్పోరేట్ కళాశాలల విద్యార్థుల పాలిట మృత్యుగీతికలుగా మారాయి. విద్యార్థులను బావి బారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన కాలేజీలు ర్యాంకులు,డొనేషన్ల వెంటపడి విద్యార్ధులకు తీవ్ర ఒత్తిడిలోకి నెడుతున్నాయి. ఇలాంటి ఓ కార్పోరేట్ కాలేజి ఒత్తిడిని తట్టుకోలేక ఓ కళాశాల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే కడప జిల్లా కృష్ఱాపురంలోని నారాయణ జూనియర్ కాలేజిలో చదువుతున్న పావని అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇవాళ తెళ్లవారుజామున కళాశాల హాస్టల్ లో సీలింగ్ ప్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని కళాశాల సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు పావని మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు.
 అయితే విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు, విద్యార్థిని బందువులు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోస్టుమార్టం అనంతరం డెడ్ బాడీ ని నారాయణ కాలేజ్ వద్దకు తీసికెళ్ళి ఆందోళన చేయాలనుకున్న బందువులు, విద్యార్ధి సంఘాలు నిర్ణయించారు. వీరు విద్వంసానికి పాల్పడే అవకాశం వుందన్న అనుమానంతో పోలీసులు మార్గమధ్యంలో శిల్పారామం వద్ద వారిని అడ్డుకున్నారు. దీంతో మృతదేహాన్ని అక్కడే పెట్టి విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నారు.