ఓ మహిళను లైంగిక వాంచ తీర్చమంటూ వేధింపులకు గురిచేస్తున్న ప్రభుత్వాధికారి బాగోతం గుంటూరు జిల్లా నరసరావుపేట లో బైటపడింది. భర్త చనిపోయి ఒంటరిగా మారిన ఓ వితంతువు తనను నరసరావుపేట టౌన్ ప్లానింగ్ ఆఫీసనర్ సాంబయ్య లైంగిక కోరిక తీర్చమంటూ వేధిస్తున్నాడని పోలీసులను ఆశ్రయించింది. దీంతో మున్సిపల్ శాఖలోని ఉన్నతాధికారి నీచ బుద్ది బైటపడింది. ఈ ఘటనకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి.

నరసరావుపేట లో వెంకట కృష్ణ కుమారి అనే వితంతు మహిళ రోడ్డు పక్కన చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని జీవనం సాగించేది. అయితే ఈప్రాంతంలో నూతనంగా మార్కెట్ నిర్మస్తుండటంతో అధికారులు రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా సదరు మహిళ కొట్టును మున్సిపల్ అధికారులు తొలగించారు. దీంతో జీవనాధారం కోల్పోయిన  మహిళ చక్రాల బండి మీద చిరు వ్యాపారం చేసుకోవటం మొదలు పెట్టింది. అయితే ఈ మహిళ ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారం చేసుకోడానికి పర్మిషన్ ఇప్పిస్తానని చెప్పి సాంబయ్య అనే మున్సిపల్ అధికారి లొంగదీసుకోడాని ప్రయత్నించాడు. లంచంగా రూ.50,000 గానీ లేకుంటే తన కోరికను గానీ తీర్చాలని సాంబయ్య తనతో అసభ్యంగా మాట్లాడాడని సదరు మహిళ తెలిపింది. తన కోరిక తీర్చకుంటే పట్టణంలో ఎక్కడా బతకనివ్వనంటూ బెదిరించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే తనను ఈ ఆఫీసర్ వేధింపుల నుండా కాపాడాలంటూ మున్సిపల్ కమీషనర్ నుఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు ఆవేధన వ్యక్తం చేసింది.

వీడియో