నిన్న మొత్తం కనిపించకుండా పోయి తీవ్ర కలకలాన్ని సృష్టించిన నల్గొండ సీఐ వెంకటేశ్వర్లు ఎట్టకేలకు దొరికాడు. ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంకలో  సీఐ ఉన్నట్లు గుర్తించిన నల్గొండ పోలీసులు అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్థానిక మెరైన్ పోలీసులు ఓ రిసార్టులో మారుపేరుతో  రహస్యంగా తలదాచుకున్న సీఐ ని గుర్తించారు. సీఐతో కలిసి పోలీస్ బృందం బాపట్ల నుంచి నల్గొండకు బయలుదేరింది.  మరికొద్ది గంటల్లో డిఐజీ ముందుకు సిఐ వెంకటేశ్వరావును ప్రవేశపెట్టనున్నట్లు జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.

 

సూర్యలంక పోలీస్ స్టేషన్ నుండి  సీఐ ని తరలిస్తున్న వీడియో