ఉప రాష్ట్రపతి వద్దంటరాష్ట్రపతి పదవి కావాలంటున్న గ్రామస్థులు. 

తెలుగు రాష్ట్రాల అంటే జాతీయ స్థాయిలో ఒకింత చిన్న చూపు మ‌నం చాలా సార్లు చూస్తునే ఉన్నాము. ఇప్పుడిప్పుడే దేశ వ్యాప్తంగా తెలుగు వాడి స‌త్తా చాటుతున్నారు. తెలుగు వాడైన మాజీ కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడికి ఎండిఎ కూట‌మీ ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి కి అభ్య‌ర్థిగా నిల‌బెట్టింది. అందుకు తెలుగు ప్ర‌జ‌లు గ‌ర్వ‌ప‌డుతున్నారు.

కానీ ఆయ‌న జ‌న్మించిన గ్రామం అయిన చౌట‌పాలేంలో ప్ర‌జ‌లు వెంక‌య్య నాయుడికి వ‌రించ‌బోతున్న‌ ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి అంత‌గా రుచించిన‌ట్లుగా లేదు. ఆ గ్రామ‌స్తుల‌కు ఆయ‌న రాష్ట్ర‌ప‌తి అయ్యి ఉంటే బాగుంటుంది అని అంటున్నారు. నిజంగా తెలుగు వాడు రాష్ట్ర‌ప‌తి అయితే తెలుగు జాతికే గ‌ర్వ‌కార‌ణం. కానీ ప్రస్తుతానికి రాష్ట్ర‌ప‌తి అయ్యో అవ‌కాశం లేదు. త‌రువాత విడుత అయిన ఆయ‌న రాష్ట్ర‌ప‌తి అవ్వాల‌ని ఆయ‌న స్వ‌గ్రామ‌స్థులు కొరుకుంటున్నారు.