Asianet News TeluguAsianet News Telugu

నాగార్జున సాగర్ గొంతు ఎండిపోతోంది..!

  • సాగర్ కు గడ్డురోజులొస్తున్నాయి
  • ప్రశ్నార్థకంగా  ఆయకట్టు రైతాంగం పరిస్థితి
Nagarjunasagar reservoir touches dead storage level

 

పేరుకు తగ్గట్టు నాగార్జున సాగర్ ఎపుడూ నీళ్లతో నిండుగా ఉండాలి. కళకళ లాడాలి. అయితే, ఈ మధ్య సాగర్ కు గడ్డురోజులొస్తున్నాయి. అగస్టు నాటికి సాధారణంగా సాగర్ లో నీళ్ల సందడి కనిపించాలి. అయితే, ఇపుడు కనిపిస్తున్నది నీళ్లకరువు. పైనుంచి కృష్ణ నీళ్లు రాక సాగర్ ఇప్పడు వెలవెలబోతోంది. గత 13 సంవత్సరాలలో ఇలాంటి పరిస్థితి ఎపుడూ రాలేదు. సాగర్ నీటి మట్టం పూర్తి స్థాయిలో పడిపోయింది. ఈ జలాశయం నీటిపైనే రెండు రాష్ట్రాల ప్రజలు ఆశలు పెట్టుకొని  జీవిస్తున్నారు.

ఎగువ నుంచి నీరు వచ్చి సాగర్ లో చేరితే గానీ.. పంటలు పండని పరిస్థితి.  వర్షాలు కురవక.. సాగర్ లో కూడా నీరు లేకపోవడంతో ఆయకట్టు రైతాంగం పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. గత మూడేళ్లుగా వర్ష పాతం సరిగా లేకపోవడంతో.. ఈ ఏడాది నాగార్జున సాగర్ నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయింది.

వర్షాకాలం మొదలై రెండు నెలలు గడుస్తున్నా.. ఆ ఆనవాళ్లు ఎక్కడా కనిపించడం లేదు.నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాలకు ఎగువ నుండి చుక్క నీరు రావడం లేదు. ఇప్పటికే ఈ రెండు జలాశయాలో నీరు అడుగంటిపోయింది. కృష్ణా పరిధిలోని జలాశయాల్లోకి ఆగస్టులో వచ్చే వరద నీటిపై నే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశలు పెట్టుకున్నారు.

 ఇప్పటి వరకు శ్రీశైలం జలాశయానికి ఎగువ నుండి నీటి రాక లేదు. ఆల్మట్టికి రెండు నెలల్లో లక్ష క్యూసెక్కులకు మించి వరద ప్రవా హం వచ్చి చేరింది. ఆల్మట్టి జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి సమీపంలో ఉన్నందున అక్కడి నుంచి వచ్చే నీటిని ఇప్పటికే విద్యుత్ ఉత్ప త్తి ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు.

 ఖరీఫ్ పంటలకు ఈ ప్రాజెక్టు నుండి నీటి విడుదల చేయాలంటే కృష్ణా డెల్టాకు 130 టిఎంసిలు, సాగర్ కుడి కాల్వ, ఎడమ కాల్వలకు 260 టిఎంసిల నీరు అవసరమౌతుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ వరదనీటితో నిండితేనే ఖరీఫ్ పంటలకు నీటిని విడుదల చేయడం సాధ్యమవుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎడమ, కుడికాల్వ, కృష్ణా డెల్టాకు తాగు, సారునీరు అందిస్తుంది.

 

శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటి మట్టం 215.08 సిఎంసిలు కాగా, ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటి మట్టం 19.5000 టిఎంసిలు. సాగర్ జలాశయం పూర్తి నీటి మట్టం 312.045 టిఎంసిలు. కనీస నీటి మట్టం 131.669 టిఎంసిలు. ప్రస్తుతం సాగర్ నీటి మట్టం 116.5756కు పడిపోయింది. ఎగువ నుండి వచ్చే వరద ప్రవాహం కోసం శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు ఎదురు చూస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios