ముంబై అగ్ని ప్రమాదంలో 15 మంది మృతి (వీడియో)

mumbai fire accident
Highlights

  • ముంబై లో భారీ అగ్ని ప్రమాదం
  • పుట్టినరోజు వేడుకల్లో విషాదం
  • 15 మంది మృతి

ముంబైలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కమలా మిల్స్ ప్రాంగణంలోని ఓ రెస్టారెంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 15 మంది మృత్యువాతపడ్డారు. మరో 14 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా ఓ భర్త్ డే పార్టీ కోసం వచ్చి ఈ ప్రమాదం చిక్కుకున్నారు. చివరకు పుట్టిన రోజు వేడుక జరుపుకుంటున్న మహిళ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందింది. దీంతో ముంబైలో విషాద చాయలు అలుముకున్నాయి.

ఈ అగ్నిప్రమాదానికి సంభందించి వివరాలిలా ఉన్నాయి.  నిన్న అర్ధరాత్రి కమలామిల్స్ ప్రాంగణంలోని మోజో బ్రిస్టో రెస్టారెంట్‌లో ఓ యువతి భర్త్ పార్టీ ఏర్పాటుచేసింది. ఈ వేడుకల్లో ఆ యువతి మిత్రులకు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అయితే అందరు వేడుకలో మునిగిపోయి ఉండగా 12 :30 సమయంలో హటాత్తుగా రెస్టారెంట్ లో మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు మొత్తం రెస్టారెంట్ లో వ్యాపించడంతో తప్పించుకోడానికి వీలు లేకుండా పోయింది. మంటలు వ్యాపించి సీలింగ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో మృతుల సంఖ్య పెరిగింది. మృతుల్లో దాదాపు 12 మంది మహిళలే ఉన్నారు. చివరకు పుట్టినరోజు జరుపుకుంటున్న యువతి కూడా ఈ మంటలకు ఆహుతయ్యింది. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. దీనికోసం వీరు దాదాపై రెండు గంటలు కష్ట పడ్డారు. అలాగే స్థానిక పోలీసులు కుడా రెస్టారెంట్ వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటన పట్ల విచారణ చేస్తేగాని అసలు ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై  వివరణ ఇవ్వగలమని పోలీస్ అధికారులు చెబుతున్నారు.

 

 

loader