సంజయ్ పెరోల్ పై వివరణ అడిగిన ముంబాయ్ కోర్టు. రెండు వారాలలో అఫిడవిట్ దాఖలు చెయ్యాలని ఆదేశం. 

మహారాష్ట ప్రభుత్వం బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ దత్ ని భలే ఇరకాటంలో పెట్టింది. మ‌రో సారి జైలుకు వెళ్లేందుకు తలుపు తెర్చింది.. ! 1993 బాంబు కేసులో నటుడు సంజయ్ దత్తుకి శిక్ష విధిస్తూ ముంబాయి హై కోర్టు 2013 లో తీర్పు ఇచ్చింది. ఆయ‌నకు ఐదు సంవ‌త్స‌రాల పాటు జైలు శిక్ష విధించింది. అందులో 42 నెల‌లు జైలు జీవితం అనుభ‌వించారు. 8 నెల‌ల ముందు పెరోల్ పై విడుదల అయ్యారు. ఇప్పుడు సంజ‌య్ దత్తు 8 నెల‌ల ముందు పెరోల్ పై విడుద‌ల అవ్వ‌డాన్ని కోర్టు ప్ర‌శ్నించింది. అయితే, అడ్వకేట్ జనరల్ మాత్రం, ప్రభుత్వం చేసిందాంట్లో తప్పుంటే దత్ జైలు కు పంపవచ్చని కోర్టు తెలపడం ఆశ్చర్యం.


సంజ‌య్ ద‌త్తు కేసును ప‌రీశీలించిన‌ జస్టిస్ ఆర్.ఎమ్ సావంత్, సాధనా జాద‌వ్‌లు మ‌హారాష్ట్ర ప‌భుత్వాన్ని ప‌లు పశ్న‌లు సంధించింది. దత్తుకు ఎనిమిది నెల‌ల ముందు జైలు శిక్ష నుండి పేరోల్ పై బ‌య‌టికి రావ‌డానికి అనుస‌రించిన‌ చట్ట బద్దమైన ప్రక్రియను ధృవీకరించాలని కోరింది. అంతేకాకుండా ఆయ‌న జైలు జీవితాన్ని గ‌డుపుతున్న‌ప్పుడు పెరోల్ పై బ‌య‌టికి వ‌చ్చారు, అలా రావడానికి అనుస‌రించిన ప‌ద్ద‌తుల‌ను వివ‌రించండి పెర్కోన్నారు. 

కోర్టు ప్ర‌శ్న‌కు మ‌హారాష్ట్ర‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన‌ అడ్వకేట్ జనరల్ అశుతోష్ కుంభకోని స‌మాధానం ఇచ్చారు. ద‌త్తు మంచి ప్రవర్తనను ప్రోత్సహించి, ఆయ‌న ప్రవర్తనకు ప్రతిఫలంగా మిగ‌తా దోషుల‌లాగే పెరోల్ మంజూరు చేశారని చెప్పారు. మేము పాటించిన ప‌ద్ద‌తుల్లో ఎమైనా అవ‌క‌వ‌క‌లు ఉంటే తిరిగి జైల్లో పెట్టాల్సిందిగా ఆయ‌న కోరారు. 


దీనికి ముంబాయి హై కోర్టు మాకు సంజ‌య్ ద‌త్తును తిరిగి జైలు కు పంపించ‌డం మా ఉద్దేశ్యం కాద‌ని తెలిపింది. ఆయ‌న 8 నెల‌ల ముందు బ‌య‌టికి రావ‌డానికి కార‌ణాల‌ను తెలపాల‌ని పెర్కొంది.

ఐదు సంవత్సరాల శిక్ష పూర్తయ్యే ఎనిమిది నెలల ముందు బ‌య‌టికి రావ‌డానికి కార‌ణాల‌ను, గ‌తంలో త‌రుచుగా పెరోల్ పై బ‌య‌టికి వ‌చ్చారు. ఆ వివ‌రాల‌కు సంబంధించిన ప‌త్రాల‌ను రెండు వారాల‌లో పూణే జైలు అధికారుల‌కు వివ‌ర‌ణాత్మ‌క అఫిడ‌విట్ దాఖ‌లు చేయ్యాల‌ని ఆదేశించింది. 

ఒక వేళ మ‌హారాష్ట్ర ప్రభుత్వం సంజయ్ పెరోల్ విష‌యంలో స‌రైన ప‌త్రాల‌ను స‌మ‌ర్పించ‌క పోతే తిరిగి జైలుకి వెళ్లే అవ‌కాశం కూడా ఉంటుంది.