అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న రాజేశ్వరరావు ఇవాళ హైదరాబాద్ యశోదలో చికిత్స పొందుతూ మృతి
భూపాలపల్లి జిల్లా ములుగు మాజీ ఎమ్మెల్యే సూరపునేని రాజేశ్వరరావు(97) ఇవాళ అనారోగ్యంతో మరణించారు. గత కొన్ని రోజులుగా గుండె సంభందిత వ్యాధితో హైదరాబాద్ లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే నిన్నటి నుండి అతడి పరిస్థితి మరీ దిగజారింది. దీంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు.
ఈయన ములుగు నియోజకవర్గానికి మొదటిసారిగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.ఈయన హయాంలో ములుగు మంచి అభివృద్ది సాధించిందని, ఆయన ఎమ్మెల్యేగా వున్న 1957-62 మధ్యకాలంలో రాష్ట్రప్రభుత్వం నుంచి అనేక నిధులు రాబట్టారని నియోజకవర్గ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. రాజేశ్వరరావు స్వస్థలం వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేట.
మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
