మంత్రి తుమ్మల కారుపై రాళ్ల దాడి

First Published 22, Dec 2017, 5:27 PM IST
MRPS workers attack minister tummala car with stones
Highlights

మంత్రి తుమ్మల ను తాకిన ఎమ్మార్పిఎస్ సెగ

మంత్రి కాన్వాయ్ పై రాళ్ల దాడి

తెలంగాణ సర్కార్ కు ఎమ్మార్పిఎస్ సెగ ఎమ్మార్పిఎస్ కార్యకర్తల నిరసన సెగ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాకింది. ఇవాళ సూర్యాపేట పట్టణంలో మంత్రి తుమ్మల ప్రయాణిస్తున్న కారుపై కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.  

వివరాల్లోకి వెళితే ఎమ్మార్పిఎస్ అద్యక్షుడు మంద కృష్ణ మాదిగ అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇటు హైదరాబాద్ తో పాటు రాష్ట్రం లోని వివిధ పట్టణాల్లోను ఈ నిరసనలు కొనసాగుతున్నాయి.  ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లాలో కూడా ఎమ్మార్పిఎస్ కార్యకర్తలు హైవేపై ఆందోళనకు దిగారు.  ఇదే సమయంలో మంత్రి తుమ్మల కాన్వాయ్ అటు వైపునుంచి వెళుతుండటంతో రెచ్చిపోయిన కార్యకర్తలు రాళ్లతో మంత్రి కారుపై దాడి చేశారు. ఈ దాడిలో మంత్రి కారుతో పాటు మరో కారు అద్దాలు పగిలినట్లు తెలుస్తోంది.

ఈ దాడితో అప్రమత్తమైన పోలీసులు ఎమ్మార్పిఎస్ కార్యకర్తలను అక్కడినుండి చెదరగొట్టారు. ఎస్సీ వర్గీకరణ, భారతి తదితర అంశాలపై నిరసన చేపట్టిన మందకృష్ణ మాదిగను అరెస్ట్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మార్పిఎస్ నిరసనలు కొనసాగుతున్నాయి. 
 

ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
 
 

loader