తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్న ఓ చిన్నారికి విచక్షణారహితంగా బాదిన కన్నతల్లి, ఆమె ప్రియుడి బాగోతం సనత్ నగర్ లో బైటపడింది. ఈ ఘటనపై స్పంందించిన పోలీసులు పిల్లాడి తల్లి, ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విదంగా ఉన్నాయి. 
 
శ్రీకాకుళం జిల్లా కు చెందిన లక్ష్మి అనే మహిళ తన భర్త చనిపోడంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ కు వచ్చి సనత్ నగర్ లో నివసిస్తోంది. మోతీనగర్ సమీపంలో ని బొబ్బాల గూడ లో నివాసముంటున్న ఈమె చిన్నా అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అయితే వీరి అక్రమ సంబంధానికి చిన్నారులు అడ్డుగా వస్తున్నారని వీరిద్దరూ ఎప్పుడూ పిల్లలపై దాడి చేసేవారు. అయితే ఈ క్రమంలో నిన్న లక్ష్మి చిన్న కొడుకు పవన్ (6 ఏళ్లు) చిన్న తప్పు చేశాడని వైర్ తీసుకుని చిన్నా విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో ఆ బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ విషయంపై స్థానికులు పోలీసులకు  సమాచారం అందించడంతో పోలీసులు లక్ష్మిని ఆమె ప్రియుడు చిన్నాను అరెస్ట్ చేశారు.

ఈ చిన్నారి దాడి ఘటనపై బాలల హక్కుల సంఘం స్పందించింది. దాడికి పాల్పడిన చిన్నా పై హత్యాయత్నం కేసు, బాలుడి తల్లి పై జె.జె 75 ప్రకారం రక్షణ, పరిరక్షణ చట్టాలు ప్రకారం కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం పోలీసులకు సూచించింది.  బాలుడికి రక్షణ కల్పించాలని బాలల హక్కుల సంఘం తరపున పోలీసులకు, ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నట్లు తెలిపింది.