పాఠశాల గదిలో దుప్పి పిల్ల 

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో సమీపంలోని మోర్దాబాద్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. చిన్నారులు ఉండాల్సిన ఓ పాఠశాల గదిలోకి ఓ చిన్న దుప్పి పిల్ల ప్రవేశించింది. తరగతి గది కిటికీ అద్దాలు పగులగొట్టుకుని లోపలికి వచ్చిన దుప్పిపిల్ల గదిలోని బ్లాక్ బోర్డు చుట్టూ కలియతిరుగుతూ కనిపించింది. బైటికి ఎలా పోవాలో తెలియక.. గదిలోనే బిక్కుబిక్కుమంటూ తిరిగింది. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. మొత్తానికి దీన్ని గమనించిన పాఠశాలయాజమాన్యం.. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు దుప్పిని పట్టుకుని మళ్లీ అడవిలోనే వదిలిపెట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Scroll to load tweet…