సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీబిజికెఎస్ నాయకులు  ప్రలోబాలకు తెరతీసారు. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశ్యంతో ఓటర్లకు డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయారు. అలా దొరికిపోయిన కొందరు టిబిజికెఎస్ నాయకుల పోటోలు ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అధికారమే పరమావదిగా ఈ కార్మిక సంఘం చేస్తున్న అవకతవకలపై నెటిజన్లు మండిపడుతున్నారు.


వివరాల్లోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని గణపురం మండల పరిధిలోని సింగరేణి కార్మికులకు  బహిరంగంగా డబ్బులు పంపిణీ చేస్తూ అడ్డంగా టిబిజికెఎస్ నాయకులు దొరికిపోయారు. అధికారాన్ని అడ్డంగా పెట్టకుని బహిరంగంగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నప్పటికి పోలీసులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.