2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, 70 సీట్లు గెలుస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రగల్బాలు పలుకుతున్నాడని అన్నారు మంత్రి కేటీఆర్. ఇదే గనక నిజమై టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే రాజకీయ తాను సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు. మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా ?  అని ఉత్తమ్ కుమార్ రెడ్డికి పౌరుషాల గడ్డ నడిగడ్డ సాక్షిగా ప్రశ్నిస్తున్నాని కేటీఆర్ అన్నారు. ఈ సవాల్ ను టీపిసిసి చీఫ్ ఉత్తమ్ స్వీకరించాలని సూచించారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీకి వచ్చేది ఒకటీ రెండు సీట్లేనని, గడ్డం పెంచినంత మాత్రాన ముఖ్యమంత్రులు కాలేరని మంత్రి విమర్శించారు. గద్వాల జిల్లా పర్యటనతో భాగంగా జరిగిన గద్వాల బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ, నాయకులపై విమర్శల వర్షం కురిపించారు.

 

గద్వాల సభలో కేటీఆర్ సవాల్ విసురుతున్న వీడియో