Asianet News TeluguAsianet News Telugu

ద్రవిడ్ అంటే అందుకే నాకంత అభిమానం - కేటీఆర్

  • రాహుల్ ద్రవిడ్ పై ప్రశంపల వర్షం కురిపించిన కేటీఆర్
  • ద్రవిడ్ అంటే ఎందుకంత ఇష్టమో చెప్పిన కేటీఆర్
minister ktr Appreciates cricketer rahul dravid

తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ మరోసారి క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ పై తన అభిమానాన్ని వ్యక్తపర్చారు. అతడు క్రికెటర్ గానే కాదు వ్యక్తిత్వం పరంగా కూడా లెజెండరీ పర్సన్ అంటూ ఆకాశానికెత్తాడు.  అసలు కేటీఆర్ కు రాహుల్ ద్రవిడ్ అంటే ఎందుకంత ఇష్టమో ఓ చిన్న ట్వీట్ ద్వారా తెలిపాడు.  ‘‘ఇందుకే రాహుల్ ద్రవిడ్ నా అభిమాన క్రికెటర్ మాత్రమే కాకుండా నా అభిమాన వ్యక్తి కూడా’’ అంటూ కేటీఆర్ ట్వట్టర్ లో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కింద మంత్రి ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ద్రవిడ్ పై వచ్చిన ఓ వార్తా క్లిప్పింగ్ ఉంచారు. ఈ క్లిప్పింగ్ లో ద్రవిడ్ కు సంభంధించిన అనేక అంశాలున్నాయి. 

అండర్ 19 జట్టుకు చీఫ్ కోచ్ గా వ్యవహరిస్తూ ఇటీవల జరిగిన ప్రనంచకప్ కు యువ జట్టుకు చక్కటి దాశానిర్దేశం చేసి గెలుపులో తన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీంతో బీసిసిఐ యువ క్రికెటర్లతో పాటు కోచింగ్ టీమ్ కు కూడా నజరానాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే చీప్ కోచ్ అతడికి 50 లక్షలు, మిగతా సిబ్బందికి 20 లక్షలిచ్చి  వివక్షతను చూపడాన్ని ద్రవిడ్ తీవ్రంగా వ్యతిరేకించారు. కోచింగ్ ఇవ్వడంలో అందరూ అంతే కష్ట్పడ్డారని, అందరికి సమానంగా పారితోషికం సమానంగా ఇవ్వాలని బిసిసిఐ కి సూచించాడు.  ద్రవిడ్ సూచనలతో బీసీసీఐ ద్రవిడ్ సహా ప్రతీ సభ్యుడికీ రూ.25 లక్షల చొప్పున ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. తన రెమ్యునరేషన్ తగ్గినా సమానత్వం కోసం ద్రవిడ్ తీసుకున్న చొరవ తీసుకున్న విదానాన్నే కేసీఆర్ తెలపాలనుకున్నాడు. అందుకే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వున్న న్యూస్ క్లిప్పింగ్ ను పెట్టి పరోక్షంగా కేటీఆర్ గుర్తు చేశారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios