జి వెంకటస్వామి పేరుతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సిద్దిపేటలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీలో మంత్రి హరిష్ రావు ప్రారంభించారు. మినీ స్టేడియంలో జరుగుతున్న ఈ టోర్నీలో  మంత్రి కాసేపు బ్యాట్ పట్టారు. స్థానిక ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి కాసేపు బౌలింగ్ చేయగా..హరీశ్ సరదాగా బ్యాటింగ్ చేసి అలరించారు. ఆయన బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ప్రేక్షకుల అరుపులు, కేకలతో స్టేడియం దద్దరిల్లింది. హరిష్ ప్రొపెషనల్ క్రికెటర్ మాదిరిగా భారీ షాట్ లతో ప్రేక్షకులను అలరించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఈ మినీ స్టేడియంలో రాబోయే సీజన్‌లో రంజీ మ్యాచ్‌ల నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి, తెలంగాణ టీ20 లీగ్ డైరెక్టర్ ఆగమరావు, మెదక్ మావేరిక్స్ ఓనర్ జగన్మోహనరావు, ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హరిష్ రావు క్రికెట్ ఆడుతున్న వీడియో