మైక్రోమ్యాక్స్ సెల్ఫీ 2 ఫోన్ ధర కేవలం రూ.9,999 ఫింగర్ ప్రింట్ స్కానర్ సదుపాయం
మొబైల్ కాంపిటీషన్ ఆసక్తికరమయిన మలుపులు తిరుగుతూ ఉంది. ఇంతవరకు టాక్ టైం గురించే పోటీ ఉండింది. ఇది ఇపుడు హ్యాండ్ సెట్ లలోకి కూడా వచ్చింది. ఫోన్ పాడైతే... ఏమిటనేదానికి గురించి ఏ కంపెనీ ఇంతవరకు అలోచించలేదు. మొట్టమొదటిసారిగామైక్రో మాక్స్ నేనున్నా నని ముందుకొచ్చింది..
ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్.. మరో కొత్త మోడల్ ఫోన్ ని విడుదల చేసింది. మైక్రోమ్యాక్స్ సెల్ఫీ 2 పేరిట విడుదల చేసిన ఈ ఫోన్ ధర కేవలం రూ.9,999 మాత్రమేనని ప్రకటించింది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ ని పొందుపరిచిన ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ఫోన్ ని కొన్న 100 రోజుల్లో.. ఫోన్ పాడైతే.. మళ్లీ కొత్త ఫోన్ ని ఇస్తామని కంపెనీ నిర్వాహకులు ప్రకటించారు. ఈ ఫోన్ ని ఆప్ లైన్ లో మాత్రమే అమ్మకాలు జరుపుతున్నట్లు వారు చెప్పారు.
మైక్రోమ్యాక్స్ సెల్ఫీ 2 ఫోన్ ఫీచర్లు :
*5.20 అంగుళాల తాకే తెర
*1.3గిగా హెడ్జ్ ప్రాసెసర్
*8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమేరా
*3జీబీ ర్యామ్
*ఆండ్రాయిడ్ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్
*32జీబీ స్టోరేజీ సామర్థ్యం
*13 మెగా పిక్సెల్ రేర్ కెమేరా
*3000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
