హైదరాబాద్ లో మెడికల్ విద్యార్థి ఆత్మహత్య

medical student suicide at hyderabad nims
Highlights

  • హైదరాబాద్ నిమ్స్ లో విషాదం
  • హాస్పిటల్ లోనే ఉరేసుకుని మెడికో సూసైడ్

ఇతరుల ప్రాణాలను కాపాడే ఓ డాక్టరే ఉరేసుకుని చనిపోయిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ లోనే  ఈ మెడికల్ విద్యార్థి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో నిమ్స్ వద్ద తీవ్ర కలకలం రేగింది.

ఈ ఆత్మహత్యకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పంజాగుట్ట లోని నిమ్స్ ఆస్పత్రిలో శివతేజ అనే పిజి వైద్యవిద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గత రాత్రి నిమ్స్ ఆసుపత్రిలోని డాక్టర్స్ క్లబ్ భవనంలో ఈ యువ వైద్యుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తెల్లవారుజామున మృతదేహాన్ని గమనించిన ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

శివతేజ ప్రస్తుతం న్యూమరాలజీ విభాగంలో పీజీ మొదటిసంవత్సరం చదువుతున్నట్లు సమాచారం. అయితే ఈ ఆత్మహత్యకు గల కారణాలు, విద్యార్థి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
 

loader