మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో దారుణం అందరూ చూస్తుండగానే యువతి ఆత్మహత్య
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ గాజులరామారం లో దారుణం జరిగింది. క్వారీ గుంతలో దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు ప్రయత్నిస్తుండగా పరిసర ప్రాంతాల్లోని కార్మికులు గుర్తించి కాపాడే ప్రయత్నం చేశారు. వారు చేరుకునేలోపే యువతి క్వారీ గుంతలోని నీటిలో జారి పడి ప్రాణాలు వదిలింది. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలను అక్కడ ఉన్న ఓ వ్యక్తి తన సెల్ఫోన్లో రికార్డు చేశాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న జగద్గిరి గుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ యువతి ఎవరు ? ఎందుకు ఆత్మహత్య చేసుకుందన్న వివరాలు తెలియాల్సి ఉంది.
