మహిళ హోమ్ గార్డుతో మసాజ్ చేయించుకున్న గద్వాల ఏఆర్ ఎఎస్సై హసన్ పై వేటు పడింది. ఎఎస్సై మసాజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, అది ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లడంతో అతడిపై  రహస్య విచారణ జరిపారు. అడిషనల్ డిఎస్పీ భాస్కర్ ఆద్వర్యంలో జరిగిన ఈ రహస్య విచారణలో తాను తప్పు చేసినట్లు హసన్ ఒప్పుకున్నాడు.దీంతో అతడిని సస్పెండ్ చేశారు.
 హోంగార్డులతో ఉన్నతాధికారులు వెట్టిచాకిరి చేయిస్తున్నట్లు ఘటనలు ఇదివరకు చాలా చోట్ల బయట పడ్డాయి. ఈ మద్యే ఓ  ఉన్నతాధికారి సేమ్ ఇలాగే ఓ హోంగార్డుతో మసాజ్ చేయించుకుంటూ అడ్డంగా దొరికిపోయిన వీడియో కూడా బయటపడి అప్పుడు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కానీ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.  అంతే కాకుండా హోంగార్డులను ఇంటిపనులకు, వెట్టిచాకిరి చేయిస్తున్న ఉన్నతాధికారుల వ్యవహారం కూడా గతంలో అనేక సార్లు బయటపడ్డాయి.  
కానీ ఈ మసాజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నారు.  అతడు విచారణ సంధర్భంగా మసాజ్ చేయించుకున్నట్లు ఒప్పుకోవడంతో ఐజీ స్టీపెన్ రవీంద్ర అతడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.