ఓ వ్యక్తిని కొందరు దుండగులు వెంటపడి మరీ నరికిన దుర్ఘటన నిన్న రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ పోలీస్ ఆఫీసర్స్ మెస్ ఎదురుగా ఉన్నఎలిగెన్స్ అపార్టుమెంట్ లో చోటుచేసుకుంది. 

ఈ కిరాతక హత్యాయత్నానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మాసబ్ ట్యాంక్ లోని ఎలిగెన్స్ అపార్ట్ మెంట్ లో ఇక్రం అనే రిటైర్డ్ నావల్ కార్గో ఆఫీసర్ తన ఫ్యామిలీతో కలిసి ఉంటున్నాడు. అయితే నిన్న రాత్రి ఏదో పనిపై బయటకు వెళ్లి తిరిగి వచ్చిన ఇక్రం తన కారు సెల్లార్ లో పార్క్ చేస్తున్నాడు. అతడి కోసం అప్పటికే అక్కడ కాపుకాసిన దుండగులు ఒక్కసారిగా అతడిపై దాడికి తెగబడ్డారు. విచక్షణారహితంగా కత్తులతో నరికి హత్యాయత్నం చేశారు.తీవ్ర గాయాలతొ అపస్మారక
స్థితిలోకి వెళ్లిన బాధితున్ని చనిపోయాడని బావించిన దుండగులు అక్కడినుండి వెళ్లిపోయయారు.

అయితే తీవ్ర రక్తస్రావమై కొన ఊపిరితో పడివున్న బాధితుడిని కుటుంబసభ్యులు బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చేబుతున్నారు. 

ఈ దాడి దృశ్యాలన్ని అపార్ట్ మెంట్ లోని సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ సిసి వీడియో ఆధారంగా నిందితులను గుర్తించే పనిలోపడ్డారు.

 

దుండగులు కత్తులతో దాడి చేసిన వీడియో కింద చూడండి