తెలంగాణ, చత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో ఇటీవల పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు ముఖ్య నేతలు హతమైన విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్ లో తమ సహచరులను కోల్పోయిన మావోయిస్టు పార్టీ నిరసనగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు. ఇలా ప్రకటన వెలువడిన వెంటనే ప్రతీకార చర్యలను మావోయిస్టులు ప్రారంభించారు. తెలంగాణ,చత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో టీఎస్ఆర్టీసి కి చెందిన బస్సును దహనం చేయడంతో పాటు అందులోని ఓ వ్యక్తిని కాల్చి చంపారు. 

ఈ దుర్ఘటకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చత్తీస్ ఘడ్ లోని జగదల్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌ వెళుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సును మావోలు సోమవారం అర్థరాత్రి దహనం చేశారు. బస్సును తమ ప్రాబల్యం ఎక్కువగా వుండే సుకుమా జిల్లా డోర్నపాల్‌ పరిధిలోని కుత్తి గ్రామం వద్ద అడ్డుకున్న మావోయిస్టులు ప్రయాణికులకు కింది కి దించి బస్సుకు నిప్పంటించారు. ఇంతటితో ఆగకుండా ప్రయాణికుల్లో ఓ వ్యక్తిని కాల్చి చంపారు.  ఆ వ్యక్తి పోలీస్ అయివుంటాడన్న అనుమానంతో హతమార్చి ఉంటారని పోలీసులు బావిస్తున్నారు.

ఇంటతిటో ఆగకుండా అదు దారిలో వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు, ట్రాక్టర్ కి నిప్పంటించి దహనం చేశారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు ఈ చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.