హైదరాబాద్ అమ్మాయిపై పెట్రోల్ పోసి నిప్పు

Man sets girl on fire allegedly for rejecting his proposal
Highlights

  • లాలాగూడ లో ఓ ప్రేమోన్మాది దారుణం
  • యువతిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన దుండగుడు

హైదరబాద్ లోని లాలగూడ లో పరిధిలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా ఓ యువతి(20)పై పెట్రోల్ పోసి నిప్పంటించి దారుణానికి ఒడిగట్టాడు. 

ఈ దుర్ఘటనపై స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ఆనవాళ్ల ఆదారంగా ఈ ఘటనకు పాల్పడ్డ నిందితుడి కోసం లాలాగూడ పోలీసులు గాలిస్తున్నారు. 

యువతిని మెరుగైన వైద్యం కోసం గాంధీ హాస్పత్రికి తరలించారు.  ఈ  పెట్రోల్  దాడి సంఘటనకు ప్రేమ వ్యవహారమే కారణయై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 

loader