సరదాగా సినిమా చూడ్డానికి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు సినిమా థియేటర్ లోనే చనిపోయాడు. థియేటర్ లో అత్యాధునికంగా అమర్చిన సీట్ల మద్య తల ఇరుక్కుని ఓ సినిమాభిమాని మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన ఇంగ్లాండ్ బర్మింగ్ హామ్ లోని ఓ థియేటర్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. 

బర్మింగ్‌హామ్‌లో స్టార్‌ సిటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కాంప్లెక్స్‌లోని వ్యూ సినిమా థియేటర్‌లో  ఓ వ్యక్తి సినిమా చూడడానికి వెళ్లాడు. అక్కడ‌ లగ్జరీ క్లాస్ టికెట్ తీసుకున్న అతడు తన సీట్లో కూర్చుని సినిమా చూస్తున్నాడు. అయితే అతడి సెల్ ఫోన్ జేబులోంచి జారి సీటు కింద పడిపోయింది. దీన్ని తీసుకోవడానికి అతడు సీటుకిందికి తల పెట్టగా ఒక్కసారిగా సీటుకు సంబంధించిన ఎలక్ట్రానిక్‌ ఫుట్‌రెస్ట్‌ తలపై పడింది. దీంతో తల అందులో చిక్కుకోవడంతో  తీవ్ర ఆందోళనకు గురై గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

దీంతో థియేటర్ సిబ్బంది సాయంతో అతడి మృతదేహాన్ని ఈ సీట్ల మద్యలోంచి తీశారు. ఇలా సరదాగా సినిమా చూడ్డానికి వెళ్లిన వ్యక్తి శవమై తిరిగిరావడంతో మృతుడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.