తన కొంటే చూపులతో, హావభావాలతో సోషల్ మీడియాను షేక్ చేసిన  ప్రియా ప్రకాష్ ఇపుడు చిక్కులో పడింది. ఒక చిన్న సన్నివేషంతోనే సోషల్ మీడియా సంచలనంగా మారిన ప్రియా ప్రకాష్ పైనా ఆమె నటించిన ఒరు అదాల్ లవ్ సినిమా పైన హైదరాబాద్ లో కేసు నమోదయింది.ఇటీవల వాలంటేన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన  ఈ సినిమాలోని "మానిక్య మలారాయ పూవి" పాట తమ మనోభావాలను దెబ్బతీశాయని, అందువల్ల ఈ సినిమాపై ఇందులో నటించిన నటి,దర్శకుడు, నిర్మాదపై చర్యలు తీసుకోవాలని ఓ వర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరి లిఖిత పూర్వక ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రియా ప్రకాష్ వారియర్... రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ సాధించిన నటి. తన వాలు చూపులతో కుర్రాడికి కన్ను గీటిన ఈ చిన్నది ఇపుడు సోషల్ మీడియా ప్రపంచానికి రాణిగా మారింది. ఆమె ఎక్స్ ప్రెషన్స్, కనుబొమ్మల కదలికలకు ఫిదా అయిన కుర్రకారు ఈ వీడియోను వైరల్ గా మార్చారు. కొన్నేళ్ల పాటు కోలీవుడు, టాలీవుడ్, బాటివుడ్ స్టార్స్ కష్టపడి సంపాధించిన స్టార్ స్టేటస్ ను ఒక్క రాత్రే ప్రియా సంపాదించింది.  గూగుల్ అన‌లిటిక్స్‌లో స‌న్నీ లియోన్‌, క‌త్రినా కైఫ్‌, అనుష్క శర్మ, దీపికా పదుకోనే లాంటి బాలీవుడ్ భామలను వెనక్కినెట్టి ఈ 18 ఏళ్ళ మళయాళ కుట్టి  మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఇన్స్టాగ్రామ్ లో మరో అడుగు ముందుకేసి హాలీవుడ్ దిగ్గజాలకు పోటీ ఇస్తోంది. ఇక వాట్సాప్ లో ఎవరి స్టేటస్ చూసినా ప్రియా కన్ను గీటుతున్న వీడియోనే. ఇలా ఒక్కటేమిటి సోషల్ మీడియా మొత్తాన్ని ఒక్క కంటిచూపుతో పడేసింది ప్రియా.

 ఇపుడు సోషల్ మీడియాలో ‘ఒరు ఆదర్ లవ్’ పాట సంచలనంగా మారడంతలో ఇదే మంచి సందర్భంగా బావించిన సినిమా యూనిట్ జోరు పెంచి  టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్‌లో కూడా హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్‌కు, హీరో రోషన్‌ ల సన్నివేశాలనే హైలైట్ చేశారు.  క్లాస్‌రూమ్‌లో సాగే సన్నివేశాల్లో కూడా వీరి  మధ్య కొంటె చూపులు కొనసాగాయి. ఈ వీడియో కూడా ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లిస్ట్ లోకి చేరింది.