షమి అలాంటివాడు కాదు : మహేంద్రసింగ్ ధోని

షమి అలాంటివాడు కాదు : మహేంద్రసింగ్ ధోని

టీం ఇండియా ప్లేయర్ మహ్యద్ షమి భార్య హసీన్ జహా జేస్తున్న ఆరోపణలతో సతమతమవుతున్న వేళ అతడికి టీం ఇండియా సభ్యుల నుండి మద్దతు లభిస్తోంది. ఇండియన్ టీంలో పాస్ట్ బౌలర్ గా షమి ఎదుగుదలకు కెప్టెన్ గా ఎంతో ప్రోత్సహించి మద్దతునిచ్చిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి మద్దతుగానిలిచాడు. కానీ ఇపుడు మద్దతునిచ్చింది క్రికెటట్ లో కాదు షమి పర్సనల్ సమస్యల్లో.  షమి, అతడి భార్యకు జరుగుతున్న ఈ వ్యవహారంలో తన సహచరుడైనా షమీకే బాసటగా నిలిచి దైర్యాన్నిచ్చే ప్రయత్నం చేశాడు.

షమి కి  అతడి భార్యకు జరుగుతున్న గొడవ వారి పర్సనల్ వ్యవహారం అంటూనే ఆమె అంటున్నట్లు షమి అంత చెడ్డవాడు కాదంటూ ధోని అభిప్రాయపడ్డారు. ''నాకు తెలిసినంత వరకు షమి మంచి మనసున్న వ్యక్తి. అతడు భార్యను, ఈ దేశాన్ని మోసం చేయలేడు. అయితే ఇదంతా అతడి వ్యక్తిగత వ్యవహారం. ఇంతకు మించి మాట్లాడలేం'' అని ధోని తెలిపాడు.

ఇప్పటికే ఈ వ్యవహారంలో షమికి మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, చేతన్ చౌహాన్ లు మద్దతిచ్చిన విషయం తెలిసిందే. షమి క్రికెట్ ను ప్రూమిస్తూ, కష్టపడి ఆడే వ్యక్తిగానే తనకు తెలుసని, అతడి భార్య చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని తాను భావిస్తున్నట్లు కపిల్ తెలిపారు. ఆ విధంగా సహచరులు, మాజీల నుండి షమికి నైతిక మద్దతు లభిస్తోంది.


 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Home Page

Next page