Asianet News TeluguAsianet News Telugu

ఇంతకీ వందేమాతరం ఏ భాష..?

  • వందేమాతరం బెంగాల్.. సంస్కృత భాష?
  • వారానికి  ఒకసారి వందేమాతరం ఆలపించాలి
  • తీర్పు వెలువరించిన న్యాయస్థానం
Madras High Court makes Vande Mataram mandatory in schools and colleges

అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ఫ్యాక్టరీలు.. పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, ఆఫీసులల్లో ఇక నుంచి తప్పనిసరిగా వందేమాతరం ఆలపించాలని మద్రాసు హైకోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది. కనీసీం వారంలో ఒక్కసారైనా ఆలపించాలని న్యాయమూర్తి తెలిపారు

ఇటీవల నిర్వహించిన స్టేట్ రిక్రూట్మెంట్ బోర్డ్ పరిక్షలో అర్హత సాధించని కారణంగా వీరమణి అనే వ్యక్తి ఉద్యోగాన్ని కోల్పోయాడు. కాగా.. ఆ పరీక్షలో వందేమాతరం ఏ భాషకు సంబంధించినది అనే ప్రశ్న అడిగారని.. అందుకు తాను బెంగాల్ అని సమాధానమిచ్చానని.. ఆన్సర్ కీలో సంస్కృతం అని ఇచ్చారని.. దీనికి న్యాయస్థానం సమాధానం చెప్పాల్సిందిగా అతను కోర్టును ఆశ్రయించాడు.

వందేమాతరం సంస్కృత భాష అని కాకపోతే బెంగాల్ లో రాసినట్లు అడ్వకేట్ జనరల్ రామకుమార్ స్వామి ఈ నెల 13వ తేదీన క్లారిఫై చేశారు. అంతేకాక వీరమణి కోల్పోయిన ఒక మార్కును తిరిగి కలిపారు.

వందేమాతరం గురించి కనీస సమాచారం కూడా నేటి తరం తెలసుకోలేకపోతోందని..ఈ నేపథ్యంలో ప్రతి విద్యా సంస్థలు, కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు వందేమాతరం ఆలపించాలని న్యాయస్థానం పేర్కొంది. అంతేకాకుండా వందేమాతర గేయాన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన వెబ్ సైట్ లలో సైతం పొందుపరచాల్సిందిగా ఆదేశించారు.

Follow Us:
Download App:
  • android
  • ios