వామ్మో... ఇంట్లోకి ప్రవేశించిన చిరుత (వీడియో)

First Published 20, Dec 2017, 2:17 PM IST
leopard enters into home at dehradoon
Highlights
  • డెహ్రాడూన్ లో భయం భయం
  • జనావాసాల్లోకి ప్రవేశించిన చిరుత
  • పట్టుకోడానికి అటవీ అధికారుల విశ్వ ప్రయత్నం

 

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో ఓ చిరుత పులి జనావాసాల్లో ప్రవేశించి హల్ చల్ సృష్టించింది. నగరంలోని కేవాల్ విహార్ కాలనీలోకి పట్టపగలే ప్రవేశించిన చిరుత కాలనీవాసులను భయబ్రాంతులకు గురి చేసింది. చిరుత కాలనీలోకి ప్రవేశించినట్లు గుర్తించిన స్థానికులు ఇంట్లోంచి మయటకు  రావడానికి బయటపడ్డారు.  ఖాళీగా ఉన్న రోడ్లపై తిరుగుతూ స్థానికులకు చెమటలు పట్టించింది.

 శాస్త్రిబుద్ధి రోడ్‌లోకి ప్రవేశించిన చిరుత ఓ ఇంటి ప్రహారిగోడను ఎక్కి ఇంట్లోకి ప్రవేశించింది. దీంతో తీవ్ర భయబ్రాంతులకు గురైన ఆ ఇంట్లోనివారు బయటకు పరుగు తీశారు.  ఈ విషయం తెలిసిన కాలనీవాసులు ఒక్క చోటికి చేరుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. కొందరు అప్రమత్తమై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు ఆ కాలనీకి చేరుకుని చిరుత కోసం వేట కొనసాగించారు. దాదాపు 7  గంటల పాటు ఆ ఇంట్లోనే వున్న చిరుత, అటవీ అధికారులకు దొరక్కుండానే మళ్లీ అడవిలోకి పారిపోయింది. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

loader