న్యాయం కోసం గుడికి వస్తున్న ప్రజలు. 18 వ శతాబ్దం నుండి ఆచారంగా వస్తుంది. రోజు వందలాది మంది దర్శించుకుంటున్నారు. శ్రీశాంత్ కూడా జడ్జి అంకుల్ గుడిని దర్శించుకున్నాడు.


సమాజంలో నేడు చేయని త‌ప్పుకు ఎంద‌రో అమాయ‌కులు శిక్ష‌లు అనుభ‌విస్తున్నారు. అందులో చాలా మంది తప్పు చేయకపోయినా సరే స‌రైన సాక్ష్యాధారాలు అందజేయలేక నేరస్తులుగా ముద్ర పడి జైల్లో ఖైదీలుగా జీవితాల‌ను గ‌డుపుతున్నారు. కానీ కేరళలో ఇలాంటి నిందలు మోస్తున్న నిరపరాధి రక్షణ కోసం జడ్జి అంకుల్ గుడి ఉంది. తప్పు చేయకుండా ఆధారాలు చూపుకోలేక శిక్షలు పడిన వారికి ఈ జడ్జి అంకుల్ గుడిలో న్యాయం జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. ఇంతకీ ఈ జడ్జి అంకుల్ గుడి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ స్టరీ చదవండి.


ఎవ‌రు ఈ జ‌డ్జి అంకుల్ ?


18వ శ‌తాబ్దంలో ధర్మరాజు కార్తీక తిరునాళ రామావర్మ అనే రాజు పాలన చేసేవారు. ఆ సమయంలో గొవిందా పిళ్ళై అనే వ్యక్తి ధ‌ర్మ‌క‌ర్త‌. మ‌ల‌యాళంలో ప్ర‌ముఖ న్యాయ‌మూర్తిగా గోవిందా పిళ్లై కీర్తీంచ‌బ‌డ్డారు. ఆయ‌న చాలా నిజాయితీ ప‌రుడు, న్యాయ‌నిర్ణ‌య‌క‌ర్త‌గా గౌర‌వించ‌బ‌డ్డారు. అత‌ని నిష్ప‌క్ష‌పాత తీర్పుల‌లో అందరి మన్ననలు ఆర్జించారు. ప్ర‌తి రోజు వంద‌లాది మంది ఆయ‌న దగ్గ‌ర‌కు న్యాయం కోసం వ‌స్తుండేవారు. వాళ్లంద‌రికి స‌రైన తీర్పులు ఇస్తూ జ‌డ్జి అంకుల్ గా పేరు తెచ్చుకున్నారు గోవిందా పిళ్లై. ఆ స‌మ‌యంలో జ‌డ్జి అనే ప‌దం వాడేవారు కాదు, మ‌న భార‌త‌దేశంలో న్యాయ‌నిర్ణ‌త అనే వారు, కానీ ఆయ‌న పేరు రానురాను... జ‌డ్జీ అంకుల్ గా మారుతూ వ‌చ్చింది.

ఎందుకు ఇంత ప్ర‌త్యేక‌త‌ ?


గొవిందా పిళ్ళై ధ‌ర్మ‌క‌ర్త అయినంత మాత్రాన ఒక త‌రం నుండి మ‌రో త‌రం వ‌ర‌కు ఒక మ‌నిషిని దేవుడి వ‌లే పూజించ‌డానికి కార‌ణం ఏంటీ? సాధార‌ణంగా జ‌ర‌గ‌దు, కానీ గొవిందా పిళ్ళై విష‌యంలో జ‌రిగింది. ఆయ‌న మేన‌ల్లుడి కేసులో న్యాయం కోసం కొంద‌రు త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చారు. నింధితుడు త‌న సొంత మేన‌ల్లుడు, విచారించిన త‌రువాత గోవిందా పిళ్ళై త‌న అల్లుడికి కూడా మ‌రణ శిక్ష విధించాడు. తనే స్వయంగా ద‌గ్గ‌ర ఉండి ఆ మ‌ర‌ణ శిక్ష‌ను అమ‌లు చేయించారు. కానీ చివ‌ర‌కు గొవిందా పిళ్ళై త‌న అల్లుడి విషయంలో తప్పుడు తీర్పు ఇచ్చినట్లు తెలుసుకున్నారు. 


దీంతో తీవ్ర మనోవేధనకు చెందిన ఆ ధర్మకర్త తుదకు తనకు తానే శిక్ష విధించుకున్నాడు. జీవించి ఉన్నంత వరకు ఇంట్లోంచి బయటకు రాకుండా శిక్ష అమలు చేసుకున్నారు. తుదకు ఇంట్లోనే మరణించారు. కానీ ఆయ‌న మ‌ర‌ణించిన త‌రువాత కూడా త‌న ఆత్మ అక్క‌డే తిరుగుతుందని అక్క‌డి ప్ర‌జ‌లు భావించారు. గొవిందా పిళ్ళై కోసం ప్ర‌జ‌లు ఒక గుడిని క‌ట్టించారు. 
సాక్ష్యాలు లేక, ఆధారాలు లేక ఎంతో మంది శిక్ష‌లకు గురవుతున్న వారు ఈ గుడిని సంధర్శిస్తే వాళ్ల‌కు త‌ప్ప‌కుండా జ‌డ్జి అంకుల్ త‌మ వైపు ఉండి అనుకూలంగా తీర్పు వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. ఇది కేరళలో ఒక సెంటిమెంట్ గా మారిపోయింది. ప్రతిరోజూ వంద‌ల మంది ఈ జ‌డ్జి అంకుల్ గుడిని సంద‌ర్శిస్తారు. 

అక్క‌డి ప్ర‌జ‌ల స‌మాచారం ప్ర‌కారం న్యాయమూర్తి అంకుల్ అందరికీ రక్షకునిగా ఉంటాడని, అధికారులు, ఐపిఎస్ అధికారులతో సహా విఐపిల నుండి సాధారణ ప్రజలు త‌మ స‌మ‌స్య‌లు అక్క‌డ ఆయ‌న‌తో చ‌ర్చిస్తే వాళ్ల‌కి అనుకూలంగా ఉంటుంద‌నే న‌మ్మ‌కం వాళ్ల‌కి ఉంది.

ఇక‌ 2013 లో క్రికెటర్ శ్రీశాంత్ ఐపీఎల్ కుంభకోణంలో ఆరోపణలు వచ్చినప్పుడు జడ్జ్ అంకుల్ గుడిని ద‌ర్శించుకున్నాడ‌ని, కోర్టులలో చార్జ్ చేయడానికి ముందు ఆలయాన్ని సందర్శించారని స‌మాచారం. మరి ఆయనకు జడ్జి అంకుల్ న్యాయం చేయిస్తారా అన్నది కేరళలో చర్చనీయాంశమైంది.