Asianet News TeluguAsianet News Telugu

ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్ లో పాక్ తో భార‌త్ ఢీ

  • అద్బుతంగా రాణించిన భారత్ జట్లు
  • ఇరు జట్లు ఫైనల్ కి చేరాయి. 
  • కప్ కోసం పాక్ తో భారత్-A ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
  • ప్లేట్ కోసం మరో ఫైనల్ లో ఇంగ్లాండ్ తో భారత్-B తలపడనుంది
lawyers world cup indian teams enter final

శ్రీలంక‌ వేదికగా జ‌రుగుతున్న 6వ న్యాయ‌వ్యాదుల ప్ర‌పంచ క‌ప్ లో భార‌త్ ఘ‌న విజ‌యాల‌తో ఫైన‌ల్ కి చేరుకుంది. 
 భార‌త్ నుండి రెండు జ‌ట్లు పాల్గొన్నాయి,ఇరు జట్లు ఫైనల్ కి చేరుకున్నాయి. భాారత్-A జట్టు అద్బుత విజ‌యాలు సాధించింది. పాక్ తో ఫైనల్ పోరుకు సిద్దమైంది. భారత్-B జట్టు కూడా ఒక్క ఓటమీ మినహా అన్ని మ్యాచ్ లల్లో విజయాలను నమోదు చేసి ఫైనల్ కి చేరింది

భార‌త్‌-A జ‌ట్టు, శ్రీలంక-B పై మొద‌టి విజ‌యం త‌రువాత ఇక తిరిగి చుసుకోలేదు. శుక్ర‌వారం జ‌రిగిన సెమీస్ లో ఆస్ట్రేలియా పై భార‌త్ జ‌ట్టు సంచ‌ల‌న విజ‌యం సాధించి పైన‌ల్ కి చేరింది.

సెమీఫైన‌ల్ లో భార‌త్‌-A జ‌ట్టు మొద‌ట బ్యాటింగ్ చేసి 30 ఓవ‌ర్ల‌కు నాలుగు వికెట్లు కొల్పోయి 255 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట్స్‌మెన్ సూర‌జ్ అద్బుత బ్యాటింగ్ తో సెంచ‌రీ సాధించారు. త‌రువాత బ్యాటింగ్ కి దిగిన 256 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగింది. ఆస్ట్రెలియా బ్యాట్స్‌మెన్‌లు భార‌త న్యాయ‌వాదుల బౌలింగ్ ముందు నిల‌వ‌లేక‌పోయారు. కేవ‌లం 126 ప‌రుగుల‌కే అలౌట్ అయ్యారు. దీనితో భార‌త్‌-A జ‌ట్టు ఫైన‌ల్ కి చేరింది.

lawyers world cup indian teams enter final
మ‌రోవైపు పాక్ జ‌ట్టు సెమీస్ లో అతిథ్య శ్రీలంక జ‌ట్టును ఓడించి ఫైన‌ల్ లోకి చేరింది.

భార‌త్, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య ఫైన‌ల్ పోరు ఆదివారం జ‌ర‌గ‌నుంది. అందుకు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదిక కానుంది.

భార‌త్‌-B జ‌ట్టు కూడా త‌న ప్ర‌పంచ క‌ప్ ప్లేట్ కోసం పోటీల్లో ఫైన‌ల్ చేరుకుంది. భార‌త్‌-B సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో
వెస్టిండీస్ పై విజ‌యం సాధించింది. మొద‌ట బ్యాటింగ్ దిగిన వెస్టిండీస్ 190 ప‌రుగుల టార్గెట్ ను ఇచ్చింది. త‌రువాత బ్యాటింగ్ కి దిగిన ఇండియా 191 ప‌రుగుల‌ను సులువుగా చేధించింది.

 భార‌త్‌-B ఫైన‌ల్ మ్యాచ్ ను ఇంగ్లాండ్ సాలిట‌ర్స్ తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్ శ‌నివారం జ‌రుగుతుంది.


 6వ న్యాయ‌వాదుల ప్ర‌పంచ క‌ప్ లో మొత్తం 8 దేశాల నుండి 12 జ‌ట్టు పాల్గోంటున్నాయి. 8 జ‌ట్లు ప్ర‌పంచ క‌ప్ కోసం పోటీ ప‌డ్డాయి. మ‌రో నాలుగు జ‌ట్లు ప్ర‌పంచ ప్లేట్ కోసం పోటీ ప‌డ్డాయి. రెండు విభాగాల్లో భార‌త్ నుండి ఇరు జ‌ట్లు ఫైన‌ల్ కి చేరుకున్నాయి. 

6వ‌ న్యాయ‌వాదుల ప్ర‌పంచ క‌ప్ ‌ థీమ్ "ఫ్రెండ్షిప్ కోసం క్రికెట్ "

Follow Us:
Download App:
  • android
  • ios