చివరి ప్రసంగం చేసిన రాష్టపతి ప్రణబ్ నా రాజకీయ గురువు ఇందిరా 7 సార్లు పార్లమెంట్ కు సభ్యుడిగా ఎంపికయ్యాను
ప్రణబ్ ముఖర్జీ హయాంలో రాష్ట్రపతి భవన్ ప్రజాస్వామికమయిందని లోక్స సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కొనియాడారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కి ఈ రోజు స్పీకర్ సుమిత్ర మహాజన్ అధ్యక్షతన వీడ్కోలు సమావేశం జరిగింది. సుమిత్ర మహాజన్ మాట్లాడుతూ ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చారని, అందరికీ ఎంతో స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసలు కురిపించారు. ప్రణబ్ రాజకీయ నాయకుడిగా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారని కీర్తించారు. ఆయన సేవలు భారతదేశానికి ఏదో రూపంలో అందుతూ ఉండాలని ఆమె కోరారు.
సమావేశంలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు, ఎల్ కే అద్వానీ, మాజీ ప్రధానులు పీవీ నర్సీంహారావు, మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఇతర విపక్ష పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారు.
ప్రణబ్ ముఖర్జీ చివరి వాక్యాలు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ నాకు ఇంత అద్బుతమై వీడ్కోలు కార్యక్రమం నిర్వహించిన సభ్యులందరికీ కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. తన రాజకీయ ప్రస్థానానికి మార్గదర్శి, రాజకీయ గురువు ఇందిరాగాంధని ఆయన తెలిపారు. ఇందిరా మహోన్నత నాయకురాలని అని కొనియాడారు. తను 1969 జులైలో తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టినప్పుడు ఇందిరా గాంధీ నాకు స్వాగతం పలికారని అన్నారు. తను ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశానని, రెండు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యానని చెప్పారు. నాడు సభలో తాను అడుగుపెట్టినప్పుడు స్వాతంత్ర్య సమరయోదులు ఉన్నారని, అదేవిధంగా అపర మేథావులు కూడా ఉన్నారని
గుర్తుచేసుకున్నారు.అందులో ప్రముఖుల సర్ధార్ వల్లాబాయ్ పటెల్, పివీ నర్సీంహారావు, ఎల్ కే అద్వానీ లాంటి గొప్ప వ్యక్తులను కలవడం నాకు జీవితంలో ఉండిపోయో తీపి గుర్తులని తెలిపారు. దేశంలో జీఎస్టీ బిల్లు తేవడం సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనమని, భిన్న మతాలు, జాతులు, భాషల ప్రజలంతా ఒకే దేశం, ఒకే జెండాగా ఉండటం గర్వకారణమని అన్నారు. పార్లమెంట్ ప్రభుత్వం, ప్రతిపక్షాల గొడవల వలన సమయం వృద అవుతుందని ఇక పై సమయం ఆదాపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన చివరగా జై హింద్ తో ముగించారు. సభికులు అందరు లేచి కరతాల ధ్వనులతో ఆయనను సాగనంపారు.
ఈ కార్యక్రమంలో ప్రస్తుత ఎంపీలందరి సంతకాలతో కూడిన పుస్తకాన్ని స్పీకర్ సుమిత్ర మహాజన్ రాష్ట్రపతి ప్రణబ్‌కు అందజేశారు.
