అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు నివురుగప్పిన నిప్పులా ఉందని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.  సీఎం కేసీఆర్ లేకపోతే  బావా,బావమరుదులు హరీశ్ రావు, కేటీఆర్ లు, కవిత రోడెక్కి కొట్టుకునే పరిస్థితి వస్తుందని అభిప్రాయపడ్డారు. పార్టీ కోసం పాలుపడుతున్న మంత్రి హరిష్ రావును కేటీఆర్ అవమానిస్తున్నాడని అన్నారు. హరీష్ ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఐటీమంత్రి కేటీఆర్ కావాలనే వెళ్లలేదని.. ఆ సమయంలో బెంగుళూరు వెళ్లి  సినిమా చూసొచ్చాడని కోమటిరెట్టి ఆరోపించారు. కేటీఆర్ ఇలా ఉంటే కేటీఆర్ కొడుకు మరో అడుగు ముందుకేశాడని, క్రికెట్ చూడటానికి ప్రెండ్స్ తో కలిసి వెళ్లిన హరిష్ కొడుకును అప్పటికే అక్కడ వున్న కేటీఆర్ కొడుకు అవమానించాడని తెలిపారు కోమటిరెడ్డి. ఇలా మీ పార్టీలోనే గొడవలు, కలహాలు ఉంచుకుని కాంగ్రెస్ పార్టీలో ఇవన్ని ఉన్నాయని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆరు నెలల తర్వాత జగదీష్ రెడ్డి అడ్రస్ ఉండదని, ఆయన మళ్లీ చీప్ లిక్కర్ అమ్ముకోవాల్సి వస్తుందని ఘాటుగా విమర్శించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

 

కేటీఆర్, హరిష్ రావుల మద్య వైరం ఎలా సాగుతుందో కోమటిరెడ్డి మాటల్లోనే కింది వీడియోలో చూడొచ్చు