కిరణ్‌బేడీ ముఖాన్ని హిట్లర్‌ ముఖంలా మార్ఫింగ్‌ చేశారు ఆ పోస్టర్లను ట్వీట్ చేసిన కిరణ్ బేడీ

పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీని పలువురు కాంగ్రెస్ నేతలు జర్మనీ నియంత హిట్లర్ తో పోల్చారు. ప్రభుత్వంతో చర్చించకుండా
కిరణ్ బేడీ ఇటీవల ముగ్గురు భాజపా నేతలను ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి నామినేట్‌ చేశారు. దీనిపై పుదుచ్చేరి ముఖ్యమంత్రి
నారాయణస్వామి సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొందరు కాంగ్రెస్‌ కార్యకర్తలు కిరణ్‌బేడీని
జర్మనీ నియంత హిట్లర్‌తో పోలుస్తూ నిరసన తెలిపారు. అంతేగాక, కిరణ్‌బేడీ ముఖాన్ని హిట్లర్‌ ముఖంలా మార్ఫింగ్‌ చేసిన పోస్టర్లను
అంటించారు. స్థానిక మీడియా పత్రికల్లో ప్రచురితమైన ఈ పోస్టర్లను కిరణ్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఇందులో కిరణ్‌ ముఖానికి
హిట్లర్‌ మీసాన్ని అంటించి మార్ఫింగ్‌ చేశారు.