విరాట్ దూకుడు తగ్గించుకోవాలని సూచించిన రణతుంగ.కోహ్లీ బ్యాటింగ్ శైలీ అద్బుతమని కితాబు.మంచి కెప్టెన్ గా పేరు సంపాధించాలని పెర్కొన్న రణతుంగ.

భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీపై తీరు మార్చుకోవాల‌ని సూచించారు శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ. కోహ్లీ మైదానం లో ప‌దే ప‌దే కోసం ప్ర‌ద‌ర్శించ‌డం స‌రికాద‌ని ఆయ‌న పెర్కోన్నారు. జ‌ట్టులోకి కొత్త‌గా వ‌చ్చిన ఆట‌గాడు దుకుడు ప్ర‌ద‌ర్శిస్తే త‌ప్పులేదు కానీ ఒక కెప్టెన్ స్థానంలో ఉండి అంతా కోపం ప్ర‌ద‌ర్శించ‌డం త‌గ‌ద‌ని ఆయ‌న అన్నారు.


 ప్ర‌పంచంలో మేటి బ్యాట్స్‌మెన్‌గా నిరూపించుకున్న కోహ్లీ, అలాగే అత్యుత్తమ కెప్టెన్‌గా గుర్తింపు పొందేందుకు ప్ర‌య‌త్నించాల‌ని ఆయ‌న సూచించారు. కెప్టెన్‌గా ఉన్న‌త స్థానాల‌కు చేరాలంటే కోహ్లీ ఎంతో కృషి చేయాల్సి ఉంద‌ని చెప్పాడు. కోహ్లీని భారత మాజీ కెప్టెన్లు అజహరుద్దీన్, ధోనీ వంటి వారితో పోల్చడం స‌రికాద‌ని ఆయ‌న పెర్కొన్నారు. కోహ్లీ బ్యాటింగ్ త‌న‌కి బాగు న‌చ్చుతుంద‌ని, ఆయ‌న శైలీ అద్బుత‌మ‌ని ర‌ణ‌తుంగ కొనియాడారు.