కమ్యూనిస్టులంటే ప్రజల మద్య ఉంటూ ప్రజల సమస్యలపై పోరాడే బావజాలం ఉంటుంది. అది సాధారణ స్థాయి కార్యకర్తలే అనుకుంటాం. కానీ ఓ కమ్యూనిస్టు సీఎం కూడా ఎలాంటి బందోబస్తు లేకుండా, సాధారణ ఓ రోడ్డుపక్క కాకా హోటల్లో భోజనం చేసి చూసేవారికి హౌరా అనిపించాడు. సాధారణ కమ్యూనిస్టు కార్యకర్తల మాదిరిగా సాధారణ జీవితాన్ని ఇష్టపడే ఆ సీఎం ఎవరో తెలుసుకోవాలంటే కింది స్టోరీ చదవాల్సిందే.
పినరయి విజయన్... కేరళ ప్రస్తుత సీఎం. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎంత ముందుంటారో, ఆడంబరాలకు అంత వెనుక వుంటారు. సాధారణ తెల్ల చొక్క, ఓ లుంగీ తో సాధాపణ మద్యతరగతి వ్యక్తి ఎలా ఉంటాడో అతా ఉంటాడు. ఈ సింప్లిసిటీ, పాలనా దక్షతతో కేరళలో అభివృద్దిని ఉరకలేత్తిస్తున్నాడు విజయన్. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న అతడిపై చిన్న ఆరోపణ కూడా రాకపోవడమే చెబుతుంది అతడెంత నిజాయతీపరుడైన ముఖ్యమంత్రో అని. 
అయితే ఆయన తన నిరాడంబరతను చాటేలా మరో పని చేశారు. తన ప్రజల మద్య, ప్రజలతో కలిసి భోజనం చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన సెక్యూరిటీని కూడా కాదని ఓ కాకా హోటల్ లో ప్రత్యక్షమయ్యాడు. ఓ సాధారణ వ్యక్తి మాదిరిగానే బోజనం ఆర్డర్ చేశాడు. అయితే ఆయన సోఎం అని హోటల్ సిబ్బందితో పాటు అక్కడున్నవారు కనిపెట్టలేకపోయారు. కొందరు మాత్రం గుర్తించినప్పటికి వారు బయటపెట్టలేదు. ఆయన బోజనం చేసి వెళ్లిపోయిన తర్వాత తెలిసింది అందరికి ఇప్పటివరకు వారి మద్య కూర్చుని భోజనం చేసింది మామూలు వ్యక్తి కాదని. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రని. ఈ విషయం తెలుసుకుని హోటల్ సిబ్బందితో పాటు అక్కడున్న వారు కూడా ఆశ్యర్యపోయారు.
అయితే ప్రజల మద్య వుంటే వారి సమస్యలు తెలుస్తాయని అందుకే వారి మద్యలోనే ఎక్కువగా ఉండటానికి ప్రయత్నిస్తానని పినరయి విజయన్ అన్నాడు. అందులో బాగంగానే ఇలా హోటల్ బోజనం చేశానని తెలిపాడు.