కేసీఆర్, పవన్  మీటింగ్ ఎలా సాగిందో చూడండి (వీడియో)

కేసీఆర్, పవన్  మీటింగ్ ఎలా సాగిందో చూడండి (వీడియో)

సోమవారం తెలుగు రాజకీయాల్లో ఓ అరుదైన సంఘటన జరిగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న పవన్, కేసీఆర్ లు ప్రగతి భవన్ సాక్షిగా దోస్తులయ్యారు. ఎంతలా అంటే అసలు ఎవరికీ ఎంట్రీ లేని, కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులు, వీవీఐపీ లకు మాత్రమే అనుమతి ఉండే సీఎం అధికారిక నివాసంలో ఈ భేటీ జరిగింది. ఇక్కడ పవన్ కు అసాధారణ రాజ మర్యాదలు లభించాయి. సీఎం కేసీఆర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు  ఆయన నివాసానికి వెళ్లినట్లు పవన్ కళ్యాణ్ తెలిపాడు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ అంధకారమవుతుందన్న వారికి జవాబుగా,  24 గంటల విద్యుత్ ఇచ్చి కేసీఆర్ తనను ఆశ్చర్యంలో ముంచెత్తాడని తెలిపారు. తాను రాజకీయ పార్టీ పెట్టానని, అందుకోసం అన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన పెంచుకోవడానికి అన్ని పార్టీల ప్రతినిధులను కలువటం జరుగుతోందన్నారు. అలాగే ఈ భేటీ జరిగిందని దీంట్లో ఏం రాజకీయాలు లేవని అన్నారు. ఈ  మీటింగ్ లో కేసిఆర్, పవన్ ల మధ్య ఇంకా అనేక అంశాలపై చర్చ జరిగింది.  

ప్రగతి భవన్ లో కేసీఆర్, పవన్ ల మీటింగ్ వీడియోను కింద చూడండి 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Home Page

Next page