ఈ మద్యకాలంలో జనాల్లో సెల్పీల గోల ఎక్కువైంది. ఈ సెల్పీల గోల ఇదివరకు సెలబ్రేటిలకే ఉండేది ఇపుడది రాజకీయ నాయకులకు పాకింది. ఎప్పుడూ ప్రజల్లో ఉండే నాయకులు, మాస్ లీడర్లు ఈ సెల్పీల గోలకు తట్టుకోలేక కాస్త దురుసుగా ప్రవర్తిస్తారు. అలా ఓ అభిమానితో హీరో బాలయ్య కాస్త దురుసుగా ప్రవర్తించి విమర్శలపాలైన విషయం తెలిసిందే. సేమ్ అలాగే కర్ణాటకలో ఓ మంత్రి సెల్పీ దిగడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిపై దాడి చేశాడు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాకెక్కి వైరల్ గా మారింది.

కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బళ్లారికి వెళ్లాడు. అయితే మంత్రి గారితో పోటో దిగాలన్న కుతూహలంతో ఆయన అనుమతి లేకుండానే  ఓ యువకుడు సెల్పీకి ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న మంత్రి.. సదరు యువకుడి చేయిపై బలంగా కొట్టాడు. ఈ క్రమంలో ఫోన్ కూడా కిందపడిపోయింది. ఈ వీడియోపై సోషల్ మీడియాలో పలు రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. మంత్రి అంత కరుకుగా ప్రవర్తించి ఉండాల్సింది కాదని కొందరు అభిప్రాయపడగా, యువకుడే అత్యుత్సాహానికి పోయి అనుమతి లేకుండా ఇలా ప్రయత్నించి మంత్రిని ఇబ్బంది పెట్టాడని అభిప్రాయపడుతున్నాడు.

 

మంత్రి యువకుడిని ఎలా కొట్టాడో కింది వీడియోలో చూడండి