శశికళకు 5 రోజుల పెరోల్ లభ్యం కాసేపట్లో విడుదలకానున్న చిన్నమ్మ

అక్రమ ఆస్తుల కేసులో కర్ణాటక పరప్పణ అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళకు 5 రోజుల ఫెరోల్ లభించింది. ఆమె అభ్యర్థన మేరకు ఐదురోజులు ఫెరోల్ ను మంజూరు చేసినట్లు జైళ్ల శాఖ అధికారులు తెలిపారు. కొద్దిసేపట్లో జైలు నుంచి బయటకురానున్న శశికళ సాయంత్రానికి చైన్నై చేరుకునే అవకాశం ఉంది.
అయితే బయటకు వచ్చి అన్ని పనులు చక్కబెట్టుకోవాలని చూసిన శశికళకు మాత్రం ఈ పెరోల్ అంతగా ఉపయోగపడేలా లేదు.ఎందువల్లంటే జైళ్ల శాఖ కొన్ని షరతులను విధించి మరీ పెరోల్ మంజూరు చేసింది. కేవలం వ్యక్తిగత పనులకోసమే ఈ అవకాశాన్ని వాడుకోవాలని, రాజకీయ కార్యక్రమాలకు గాని, వ్యవహారాల జోలికి కానీ వెళ్లకూడదని శశికళను సూచించింది. అంతే కాదు ఆమె కోరినట్లు 15 రోజులు కాకుండా 5 రోజులే బయటకు వదలడంతో శశికళ వర్గం ఒకింత అసంతృప్తిగా ఉన్నారు.
 అయితే చిన్నమ్మ కూడా ఈ షతులకు లోబడి రాజకీయాల జోలికి పోకుండా, తన భర్త నటరాజన్ ఆరోగ్య పరిస్థితి విషమించిన దృష్ట్యా ఆస్పత్రికే పరిమితమయ్యే అవకాశం ఉంది.