కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిరిసిల్ల నుండి కరీంనగర్ వైపు వెళుతున్న బైక్  వెనుకనుండి వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ ఎగిరి రోడ్డు పక్కన పడింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఓ ఎస్సై అక్కడికక్కడే మృతి చెందాడు. 

ఈ ప్రమాధానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఖాజా  మొయినుద్దీన్ పోలీస్ డిపార్టుమెంట్ లోని పదిహేడో బెటాలియన్‌లో ఎఆర్ఎస్ఐ గా పనిచేస్తున్నాడు.అతడుసిరిసిల్ల నుండి కరీంనగర్ కు ద్విచక్రవాహనంపై వెళుతుండగా కొత్తపల్లి మండలం బాపుపేట వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వెనుకవైపునుండి అతివేగంతో వచ్చిన లారీ బైక్ ను ఢీ కొట్టడంతో ఎస్సై తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన ఎస్సైని ఆస్పత్రికి తరలించారు. అయితే గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో చికిత్స పొందుతూ మొయినుద్దీన్ మృతి చెందారు. ఎస్సై స్థాయి అధికారి ప్రమాదంలొ మరణించడంతో  పోలీస్ డిపార్టుమెంటులో విషాదం నెలకొంది. ఈ వార్త తెలిసి మృతుడి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ యాక్సిండెంట్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.