తన పై తప్పుడు ప్రచారం చేస్తూ అసత్య ఆరోపణలు చేయిస్తున్న రామానంద మహర్షి పై హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది సినీనటి కరాటే కల్యాణి.   అతడి ఆద్వర్యంలో నడిచే శివ శక్తి సాయి భక్తి ఛానెల్ లో తనను కించపరిచే విధంగా కార్యక్రమం ప్రసారం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆధ్యాత్మిక ముసుగులో ఛానల్ నడుపుతున్న అతడి వ్యాఖ్యలపై గతంలో తాను ఖండించినందుకే తన పై కక్ష పెంచుకున్నారని అన్నారు. ఈ కారణంగానే  తన వ్యక్తిగత విషయాలను భక్తి ఛానల్ లో ప్రసారం చేసి తన మనోభావాలు దెబ్బతీసారని ఆమె పేర్కొన్నారు. వీరుమ ప్రసారం చేసిన వార్తలకు ఎలాంటి ఆధారులు, సాక్ష్యాలు   లేకుండానే ప్రసారం చేశారని ఆమె పేర్కొన్నారు. 

మహిళ అని కూడా చూడకుండా తనను అవమానించిన శివ శక్తి సాయి టివి ఛానల్ పై కేసు నమోదు చేసి తన పై ప్రసారం చేసిన వార్తలను సోషల్ మీడియా నుండి తొలగించాలని డిమాండ్ చేశారు కల్యాణి.  అలాగే తనకు స్వామిజీ తో తనకు క్షమాపణలు చెప్పించాలని కోరారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కరాటే కల్యాణి ఇచ్చిన యు ట్యూబ్ లింక్స్ పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. 
 

వీడియో