ఉత్తర ప్రదేశ్ కనౌజ్ లో ఘోర ప్రమాదం పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించిన కారు
ఉత్తర ప్రదేశ్ లో కనౌజ్ పట్టణంలో ఓ కారు డ్రైవర్ భీభత్సం సృష్టించాడు. కారు డ్రైవింగ్ ను నేర్చుకుంటున్న ఓ వ్యక్తి సహాయకులు లేకుండానే కారు నడపడానికి ప్రయత్నించాడు.కానీ కారులో పెట్రోల్ అయిపోడంతో కొట్టించడానికి బంకు లోకి పోనిచ్చాడు. అయితే ఈ క్రమంలో కారు అదుపుతప్పి పెట్రోల్ బంక్ లోకి దూసుకుపోయింది. పెట్రోల్ కోసం వేచి వున్న ద్విచక్ర వాహనాలతో పాటు బంకు సిబ్బందిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికి చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. కొద్దిసేపు ఈ ప్రమాదం నానా హంగామా సృష్టించింది.
వీడియో
Scroll to load tweet…
