ఖమ్మం జిల్లాలో భారీ ఎన్కౌంటర్

First Published 14, Dec 2017, 10:59 AM IST
kammam encounter
Highlights
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్ కౌంటర్
  • 8 మంది నక్సల్స్ మృతి
  • కొనసాగుతున్న పోలీసుల కూంబింగ్

ఇప్పటికే బాగా బలహీనపడి  ఉనికిని కోల్పోతున్న నక్సల్స్ ఉద్యమానికి మరో ఎదురుదెబ్బ తగిలింది.భద్రాద్రి జిల్లా అటవీ ప్రాంతంలో ఇవాళ జరిగిన ఎన్ కౌంటర్ లో 8 మంది నక్సల్స్ మృత్యువాత పడ్డారు.

వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి సమీపంలోని బోడు అటవీ ప్రాంతంలో నక్సల్స్ జాడను  పోలీసులు గుర్తించారు.వీరి కదలికలపై  నిఘా ఉంచిన స్పెషల్ కూంబింగ్ టీమ్ ఇవాళ వారిపై కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన నక్సల్స్ కూడా ఎదురుకాల్పులకు దిగారు. అయితే పోలీసులు పకడ్బందీ వ్యూహంతో వచ్చి కాల్పులకు తెగబడటంతో 8 మంది నక్సల్స్ మృతి చెందారు. వీరంతా ఇటీవల చండ్ర పుల్లారెడ్డి గ్రూప్ గా ఏర్పడిన దళ సభ్యులుగా పోలీసులు గుర్తించారు.  అడవిలో పోలీసుల కూంబింగ్ ఇంకా కొనసాగుతుంది.

సంఘటన స్థలంలోని ఎనిమిది మృతదేహాలు, ఆరు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 ఎన్కౌంటర్ మృతుల వివరాలిలా ఉన్నాయి

 
 1. ఈసం నరేష్

2. తిరుకులూరి మధు

3.  భూక్య  నర్సింహా

4. మేకల సమ్మయ్య

5. సుభాష్ 

6. బోయిని ఓంప్రకాశ్

7. రామస్వామి

8. రషీద్

మిగతా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

loader